స్పెషల్ ఫ్రెండ్; శుభలేఖతో నానీ ఇంటికి కీర్తి, ఆంటోని
టాలీవుడ్ లో ఓ ఫ్రెండ్షిప్ గురించి సోషల్ మీడియా ఊగిపోతూ ఉంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్... స్టార్ హీరో నానీ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరూ కలిసి హిట్ సినిమాల్లో నటించడమే కాకుండా ఇద్దరి మధ్య స్నేహం... ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ గా మారింది. కీర్తి హైదరాబాద్ వస్తే ప్రత్యేకంగా హోటల్ లో ఉండకుండా నానీ ఇంట్లోనే ఉంటుంది.
టాలీవుడ్ లో ఓ ఫ్రెండ్షిప్ గురించి సోషల్ మీడియా ఊగిపోతూ ఉంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్… స్టార్ హీరో నానీ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరూ కలిసి హిట్ సినిమాల్లో నటించడమే కాకుండా ఇద్దరి మధ్య స్నేహం… ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ గా మారింది. కీర్తి హైదరాబాద్ వస్తే ప్రత్యేకంగా హోటల్ లో ఉండకుండా నానీ ఇంట్లోనే ఉంటుంది. అలాగే నానీ ఫ్యామిలీతో ఆమెకు మంచి బాండింగ్ ఉంది. నానీ ఆమెను సోదరిలా భావిస్తాడు అనే కామెంట్స్ కూడా మనం చూస్తూనే ఉంటాం. నానీ వైఫ్ తో కలిసి ఆమె పలు ఫంక్షన్స్ కూడా అటెండ్ అయ్యారు.
ఇక నానీ కొడుకుతో కీర్తికి మంచి అనుబంధం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి సురేష్ బయటపెట్టింది. నానీ కొడుకు తనను యేమని పిలుస్తాడో కూడా చెప్పింది. అలాగే తనకు వాయిస్ మెసేజ్ లు కూడా పెడుతూ ఉంటాడని… అవి చూసి తాను నవ్వుకుంటాను అని చెప్తుంది. అలాగే తనను చాలా ముద్దుగా పిలుస్తాడు అని కీర్తి బయటపెట్టింది. ఈ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి చివరిసారిగా దసరా సినిమాలో నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.
ఇక ఇప్పుడు మరో సినిమాలో కూడా ఈ ఇద్దరూ నటిస్తున్నారు. దాని కంటే ముందు కీర్తి సురేష్ వివాహం జరగనుంది. ఈ వివాహానికి నానీ ఫ్యామిలీ మొత్తం హాజరు కానుంది. అందుకే… కీర్తి సురేష్… తన కాబోయే భర్త ఆంటోనితో కలిసి నానీ ఇంటికి వెళ్తున్నారు. నానీ కుటుంబానికి శుభలేఖ కూడా అందించి ఆహ్వానించడానికి రెడీ అయ్యారు. వచ్చే నెల 11 న ఈ వివాహం గోవాలో జరగనుంది. టాలీవుడ్ నుంచి అతి తక్కువ మంది ఈ వివాహానికి హాజరు అవుతారు. రానా, నానీ, విజయ్ దేవరకొండ సహా అతి తక్కువ మంది హాజరు కానున్నారు.
మహేష్ బాబు ఫ్యామిలీకి కూడా ఆహ్వానం లేదని సమాచారం. నానీతో స్పెషల్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి కీర్తి సురేష్.. ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానిస్తున్నారట. ఇక ఈ వివాహానికి ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. గోవాలో వివాహం చేసుకోవాలని కీర్తి, ఆంటోని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కీర్తి తండ్రి కూడా ఇప్పటికే ఈ వివాహంపై క్లారిటీ ఇచ్చారు. మరి అతిధులు ఎవరూ అనేది త్వరలోనే క్లారిటీ రానుంది. ప్రస్తుతం కెరీర్ పరంగా ఇబ్బంది పడుతున్న కీర్తి… ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయింది.