స్పిరిట్ షూట్ అప్డేట్ వచ్చేసింది.. సమ్మర్ లో స్పిరిట్ హీట్

రెబల్ స్టార్ ప్రభాస్, డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ అనగానే పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ క్రియేట్ అయింది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు వస్తుందా అని బాలీవుడ్ జనాలు కూడా వెయిట్ చేయడం మొదలుపెట్టారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 1, 2025 | 02:39 PMLast Updated on: Feb 01, 2025 | 2:39 PM

Spirit Shoot Update Has Arrived Spirit Heat In Summer

రెబల్ స్టార్ ప్రభాస్, డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ అనగానే పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ క్రియేట్ అయింది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు వస్తుందా అని బాలీవుడ్ జనాలు కూడా వెయిట్ చేయడం మొదలుపెట్టారు. యానిమల్ సినిమాతో తాను ఏంటీ అనేది బాలీవుడ్ లో కూడా ప్రూవ్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ప్రభాస్ ను ఏ రేంజ్ లో చూపించబోతున్నాడు… స్పిరిట్ సినిమా ఏ రికార్డుల బద్దలు కొట్టబోతుంది అంటూ జనాలు గట్టిగానే ఎదురుచూస్తున్నారు. ఇంకా ఇప్పటికే ఈ సినిమా వర్క్ దాదాపుగా 20% వరకు కంప్లీట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ.

అయితే ప్రభాస్ షూటింగ్ కు అటెండ్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో కొంత షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్టు అంటే మ్యూజిక్ హైలెట్ అవుతూ ఉంటుంది. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేసిన సందీప్ రెడ్డి కొన్ని యాక్షన్ సన్నివేశాలకు మ్యూజిక్ కొట్టించినట్లు సమాచారం. తన సినిమాలకు తానే ఎడిటర్ గా పనిచేసే సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా విషయంలో కూడా అలాగే వర్కౌట్ చేస్తున్నాడు. యానిమల్ సినిమాతో ఎడిటర్ గా తాను ఏంటి అనేది ఇండియన్ సినిమాకు చూపించాడు సందీప్ రెడ్డి.

ఇక ఎడిటర్ గా ప్రభాస్ కు ఏ రేంజ్ ఎలివేషన్స్ ప్లాన్ చేశాడా అనేదే జనాల్లో ఉన్న ఇంట్రెస్ట్. ఇక ఈ ప్రాజెక్టుకు స్పిరిట్ అనే టైటిల్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. త్వరలోనే దీనికి సంబంధించి టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది అని ఓ న్యూస్ సందీప్ రెడ్డి ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది. దీనితో జనాల్లో క్రేజ్ పెరిగిపోయింది. ఇక ప్రభాస్ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోంది.. పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ ఎలా కనబడుతున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించడంతో ఈ సినిమాలో ప్రభాస్ కు ఏ రేంజ్ ఎలివేషన్ సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసి ఉండొచ్చు అంటూ రెబల్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే కొన్ని ఫోటోలు కూడా వైరల్ చేస్తున్నారు.

ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో ప్రభాస్ రాజా సాబ్ అనే సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్లో సినిమా స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ వరకు ఈ రెండు సినిమాల షూటింగ్ కంటిన్యూ చేసి మే నుంచి సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం. గతంలో కూడా ఇదే విషయాన్ని ఈ సినిమా నిర్మాత భూషణ్ కుమార్ అనౌన్స్ చేశాడు. ప్రభాస్ ఫస్ట్ టైం పోలీస్ గా కనపడటంతో మేకోవర్ కు కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంది. అయితే ఎక్కువ టైం తీసుకోకుండా మేలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడు. ఇక ప్రభాస్ ఈ సినిమా తర్వాత సలార్ సీక్వెల్ అలాగే కల్కీ సీక్వెల్ తో పాటుగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఒక సినిమా చేయనున్నాడు.