Spy Movie: సుభాష్ చంద్రబోస్ పేరుని అడ్డంగా వాడేశారు.. మహా మోసం..!
ఏకంగా మన దేశ తలరాతనే మార్చిన ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రభోస్ పేరునే వాడి, ఏదో నిజంగా ఆయన జీవితం తాలూకు రహస్యాలు బద్దలు కొడతాం అన్నారు. ఏమైంది హాలీవు్డ్ నుంచి కాపీకొట్టిన సీన్ల మధ్య దిక్కుమాలిన కథలను పూరించి, అదేదో జేమ్స్ బాండ్ మూవీ అన్నంత బిల్డప్ ఇచ్చారు.
Spy Movie: కార్తికేయ-2 పాన్ ఇండియా లెవల్లో హిట్టైంది కదాని, పాన్ ఇండియామార్కెట్ ని కొల్లగొట్టేద్దాం అంటే కుదురుతుందా. నిఖిల్ సిద్ధార్థ్ అలాంటి ప్రయత్నమే చేసి, మోసం చేశాడనే ముద్ర పడేలా చేసుకున్నాడు. ఏకంగా మన దేశ తలరాతనే మార్చిన ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రభోస్ పేరునే వాడి, ఏదో నిజంగా ఆయన జీవితం తాలూకు రహస్యాలు బద్దలు కొడతాం అన్నారు.
ఏమైంది హాలీవు్డ్ నుంచి కాపీకొట్టిన సీన్ల మధ్య దిక్కుమాలిన కథలను పూరించి, అదేదో జేమ్స్ బాండ్ మూవీ అన్నంత బిల్డప్ ఇచ్చారు. కనీసం రిలీజ్ కిముందే 20 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఓకే కాని, లేదంటే ప్రివ్యూ వేస్తే, కనీసం తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా సేల్ కాలేకపోయేదనే కామెంట్స్ ఉన్నాయి. అంత చీప్ కంటెంట్‌తో తెరకెక్కింది స్పై మూవీ. హాలీవుడ్‌లోని సీన్లనే ఘోరంగా కాపీ కొట్టి, ఏదో తొక్కలో న్యూక్లియర్ ఎటాక్ అనే పాయింట్ పట్టుకుని, దానిని ఓ ఇండియన్ స్పై ఎలా ఛేధించాడు అనటం, దీనికి సుభాష్ చంద్రభోస్ జీవిత రహస్యాలను లింక్ చేసి, ఏదీ తేల్చకుండా, ఏదో రీసెర్చ్ చేసి కనిపెట్టా అనేంత బిల్డప్ ఇవ్వటం ఖచ్చితంగా మోసమే.
కార్తికేయ-2 హిట్టైంది కాబట్టి, ఆ ఊపులో ఈ సినిమాను జనం చూడ్డానికి రావటం సహజం. అక్కడే కథలో లేని సుభాష్ చంధ్రబోస్ సీక్రెట్స్ కాన్సెప్ట్ ని తర్వాత యాడ్ చేసి, నార్త్ ఇండియాలో కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేసింది స్పై మూవీ. కాని కంటెంట్ వీక్ అయితే, తగిలేది షాకే. అదేజరిగింది. గురువారమే విడుదలైన మరో మూవీ సామజవరగమన టాక్ బెటర్‌గా ఉంది. ఇదేం అంత గొప్ప కథకాదు. శ్రీవిష్ణు, నరేష్ పెర్ఫామెన్స్ బాగున్నా, రొటీన్ కామెడీ సీన్లు బోర్ కొట్టిస్తున్నాయి. కాకపోతే కథలో ట్విస్ట్, మేకింగ్, సాంగ్స్ తోపాటు మిగతా సీన్లు ఆకట్టుకుంటున్నాయి. ఓవరాల్‌గా జస్ట్ యావరేజ్ టాక్‌తో సరిపెట్టింది సామజవరగమన. ఏదేమైనా ఈ వారం హాలీవుడ్ మూవీ ఇండియానాజోన్స్, సామజవరగమన రెండూ యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి.