Spy Movie Review: స్పై మిషన్ ఫెయిల్.. 100% జెన్యూన్ రివ్యూ..
మంచి అంచనాలతో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఎంతో హైప్ క్రియేట్ చేసి.. నార్మల్ కథను అంతకంటే నార్మల్‌గా చూపించడంతో ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. స్పై అనగానే సినిమా కథ ఏంటో ఆడియన్స్‌కి ఓ క్లారిటీ ఉంటుంది.
Spy Movie Review: గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందిన స్పై సినిమా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. మంచి అంచనాలతో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఎంతో హైప్ క్రియేట్ చేసి.. నార్మల్ కథను అంతకంటే నార్మల్‌గా చూపించడంతో ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. స్పై అనగానే సినిమా కథ ఏంటో ఆడియన్స్‌కి ఓ క్లారిటీ ఉంటుంది. అంతా అనుకున్నట్టే సినిమాలో నిఖిల్ రా ఏజెంట్.
శ్రీలంకలో ఓ మిషన్ పూర్తి చేసుకుని ఇండియాకు వస్తాడు. అదే సమయంలో రా ఏజెంట్‌గా పని చేస్తున్న హీరో అన్నను విలన్స్ చంపేస్తారు. సుభాష్ చంద్రబోస్ మిస్ అవ్వడానికి సంబంధించిన ఫైల్ కూడా మిస్ అవుతుంది. ఈ రెండిటినీ ఛేదించే మిషన్‌ను రా ఏజెంట్ హీరోకు అప్పగిస్తాడు. దానికోసం నిఖిల్ నేపాల్ వెళ్తాడు. అక్కడే మరో రా ఏజెంట్‌గా పని చేస్తున్న హీరోయిన్ కలుస్తుంది. వీళ్లు అంతకుముందే కొన్నాళ్లు లవ్‌లో ఉండి విడిపోతారు. వీళ్లిద్దరి మధ్య లవ్ మళ్లీ ఎలా పుట్టింది. రా ఏజెంట్‌ను చంపిన విలన్స్‌ను నిఖిల్ ఎలా పట్టుకున్నాడు, ఫైల్ ఎలా దక్కించుకున్నాడు అనేది మిగతా కథ. స్పై సినిమాల్లో ఎప్పుడూ చూపించే కథనే స్పై సినిమాలో కూడా చూపించారు. కానీ లవ్ సీన్స్ బాగా ఎక్కువైనట్టు అనిపించింది.
హీరో రా సంస్థకు వెళ్లడానికి కారణం ఏంటి, సుభాష్ చంద్రబోస్ ఫైల్‌లో ఏముంది అనే విషయంతో ట్రైలర్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. కానీ సినిమాలో వాటికి సమాధానం మాత్రం ఇవ్వలేదు. ఇది పెద్ద డ్రా బ్యాక్. ఇదేదో దేశభక్తి సినిమా అనుకుని థియేటర్‌కు వెళ్తే ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వడం గ్యారెంటీ. ఎందుకంటే సినిమాలో దేశభక్తి, యాక్షన్ సీన్స్ కంటే లవ్ సీన్సే ఎక్కువగా ఉన్నాయి. అభివన్ గోమఠం కామెడీ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసింది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉందా అంటే ఉంది అన్నట్టుగానే ఉంది.
ఇక స్పెషల్ అప్పియరెన్స్‌లో రానా కాసేపు కనిపించి వెళ్లిపోతాడు. రానా చరిష్మాను కూడా మూవీ మేకర్ పెద్దగా వాడుకోలేదు. సినిమాటోగ్రపీ కూడా అంతంతమాత్రంగానే ఉంది. కొన్ని సీన్స్‌లో బీజీఎం అద్భుతంగా ఉన్నా మ్యూజిక్ యావరేజ్ అనే చెప్పాలి. ఓవరాల్‌గా మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన స్పై సినిమా ఆడియన్స్‌ను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది.