Sreeleela: హీరోలందరికీ ఆమే మరదలు.. మెగా మరదలు కూడా ఆమేనా..?
మహేశ్ బాబు మరదలిగా గుంటూరు కారానికి మసాలా యాడ్ చేయబోతోంది శ్రీలీల. ఆల్రెడీ పోస్టర్ కూడా వచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరదలిగా కూడా మారబోతోంది. త్రివిక్రమ్ మేకింగ్‌లో ఆహా టీం తెరకెక్కించే మూవీలో బన్నీకి బబ్లీ మరదలిగా శ్రీలీల కన్పామ్ అయ్యింది.

Sreeleela: టాలీవుడ్ హీరోలందరికి కామన్‌గా ఒకే ఒక్క మరదలు పిల్ల దొరికిందా..? ఎవరు చూసినా కన్నడ లేడీ శ్రీలీలని మరదలిగానే చూస్తున్నారా? వినటానికి విచిత్రంగా ఉన్నా, ఈ హీరోయిన్‌కి వస్తున్న ఆఫర్లు అంతకంటే విచిత్రంగా ఉన్నాయి.. ఉంటున్నాయి. మహేశ్ బాబు మరదలిగా గుంటూరు కారానికి మసాలా యాడ్ చేయబోతోంది శ్రీలీల.
ఆల్రెడీ పోస్టర్ కూడా వచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరదలిగా కూడా మారబోతోంది. త్రివిక్రమ్ మేకింగ్‌లో ఆహా టీం తెరకెక్కించే మూవీలో బన్నీకి బబ్లీ మరదలిగా శ్రీలీల కన్పామ్ అయ్యింది. అదొక్కటే కాదు, వైష్ణవ్ తేజ్ తో చేస్తున్న ఆదికేశవ్‌లో కూడా శ్రీలీలది మరదలి పాత్రే అని కన్ఫామ్ అయ్యింది. ఓవైపు బాలయ్య కూతురిగా భగవంత్ కేసరిలో నటిస్తున్న శ్రీలీల, చిరు మేనకోడలిగా మరో మూవీలో నటించబోతోంది. ఇలాంటి వరసల్లో కూడా మెరవనున్న తను, ఎన్ని పాత్రలు వేసినా, ఎన్ని ఆఫర్స్ పట్టినా, వరుసగా మూడు మూవీల్లో మరదలి పాత్రలు వేయటంతో, టాలీవుడ్ మరదలి పిల్ల అనేస్తున్నారు.
ముఖ్యంగా వైష్ణవ్ తేజ్, బన్నీతో జోడీ కడుతూ మరదలిగా మారుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్‌లో కూడా పవన్ మరదలే అనే ప్రచారం నిజమైతే, మెగా మరదలు అనుకునే పరిస్తితి కూడా వస్తుంది.