Sreeleela: ఒక్క ఫ్లాప్ పడినా శ్రీలీలకు కష్టాలేనా..?
డజన్ మూవీలతో శ్రీలీల ప్రస్తుతం బిజీ. కానీ, ఈలోపే స్కంద లాంటి ఫ్లాప్ పడటంతో శ్రీలీలకి పంచ్ కాలం మొదలైందంటున్నారు. అచ్చంగా ఇలానే కృతిశెట్టి కెరీర్ అలా పెరిగి, ఇలా పడిపోయింది. వరుసగా ఒకటి రెండు ప్లాప్స్ పడితే మాత్రం ఇన్ సెక్యూర్ ఇండస్ట్రీ తనని కూడా పక్కన పెట్టే ఛాన్స్ ఉంది.
Sreeleela: శ్రీలీల అంటేనే టాలీవుడ్ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్. మహేశ్ బాబు గుంటూరు కారం, పవన్ ఉస్తాద్ భగంత్ సింగ్ నుంచి, సీతారామం ఫేం హను రాఘవపూడి తీసే ప్రభాస్ మూవీలో కూడా తనే మెరవబోతోంది. పెద్ద హీరోల దగ్గరి నుంచి నితిన్, రామ్, వైష్ణవ్ తేజ్ వంటి యంగ్ హీరోల వరకు శ్రీలీలే హీరోయిన్‌గా చేస్తోంది. భగవంత్ కేసరి అంటూ బాలయ్య లాంటి సీనియర్ హీరో పక్కన కూతురి పాత్రలు కూడా చేస్తోంది. ఇలా డజన్ మూవీలతో శ్రీలీల ప్రస్తుతం బిజీ. కానీ, ఈలోపే స్కంద లాంటి ఫ్లాప్ పడటంతో శ్రీలీలకి పంచ్ కాలం మొదలైందంటున్నారు.
అచ్చంగా ఇలానే కృతిశెట్టి కెరీర్ అలా పెరిగి, ఇలా పడిపోయింది. వారియర్, మాచర్ల నియోజకవర్గం, అ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. అంటూ హ్యాట్రిక్ ప్లాపులు ఫేస్ చేసింది. అడ్రస్ లేకుండాపోయింది. ఏదో ఒకటీ, అర తెలుగు ఆఫర్లు ఉన్నా, తనకి గత వైభవం కష్టమే అంటున్నారు. పూజాహెగ్డే కూడా ఇలానే ఒక్కసారిగా రాకేట్ వేగంతో ఎదిగి, వెలిగి.. తర్వాత ఐరన్ లెగ్ అంటూ నలిగిపోతోంది. వరుస ఫ్లాపులు, ప్రాజెక్టుల నుంచి బయటికి పంపడాలతో తన ఫ్యూచర్‌కే పంచరైంది. అచ్చంగా శ్రీలీల పరిస్థితి కూడా ఇలానే అవుతుందా అంటే, ఒక్క స్కంద ప్లాపైనంత మాత్రాన తనకేం జరక్కపోవచ్చు. కానీ, వరుసగా ఒకటి రెండు ప్లాప్స్ పడితే మాత్రం ఇన్ సెక్యూర్ ఇండస్ట్రీ తనని కూడా పక్కన పెట్టే ఛాన్స్ ఉంది.
కాకపోతే గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్ వేగంగా షెడ్యూల్స్ పూర్తి చేసుకుంటుండటం చూస్తుంటే మరో ఫ్లాప్ పడ్డా కాని ఐదారు నెలల్లో తను కమిటైన 90 శాతం సినిమాలు పూర్తవుతాయి. సో.. అలా చూస్తే తన ఫ్యూచర్‌కు ఢోకా లేదు. కాని అందరితో జోడీ కట్టాక తన వైపు మళ్లీ అదే హీరోలు చూస్తారా అంటే.. అది కూడా డౌటే. దానికి తోడు మరో ఫ్లాప్ పడితే ఏంటి పరిస్థితి..? ఆ కోణంలో శ్రీలీలకి గడ్డుకాలమే ముందుంది. కన్నడ ముద్దుగుమ్మల్లో రష్మికతో పోలిస్తే ఎక్కువ శాతం రిస్క్ శ్రీలీలకే ఎదురు కాబోతోంది. మరొక ఫ్లాప్ పడితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పేలా లేవు.