Sreeleela: కళ్లు మూసినా శ్రీలీలే కనిపిస్తోందంటున్న ఫ్యాన్స్‌.. ఈ అమ్మడుకు ఎందుకింత క్రేజ్‌..

ఇప్పుడు ఏ సినిమా గురించి మాట్లాడినా శ్రీలీల టాపిక్‌ వస్తోంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 8 ప్రాజెక్ట్‌లు లైన్‌లో పెట్టింది శ్రీలీల. ఆ సినిమాలకు సంబంధించి ఏ అప్‌డేట్‌ వచ్చినా ఆ సినిమాలో శ్రీలీల ఉంది కాబట్టి అంతా ఆమె గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 15, 2023 | 01:10 PMLast Updated on: Jun 15, 2023 | 1:10 PM

Sreeleela Is Going To Be A Top Heroine She Is Acting In 8 Movies

Sreeleela: ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం.. అదే ఒక్కరే మీదడిపోతే దండయాత్ర. ఈ డైలాగ్‌ హీరోయిన్‌ శ్రీలీలకు సరిగ్గా సెట్‌ అవుతుంది. ఎందుకంటే పోటీ లేకుండా వరుసగా అన్ని సినిమాలు తానే చేస్తూ ఈ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్‌లో దండయాత్ర కొనసాగిస్తోంది.

జనరల్‌గా ఓ హీరోయిన్‌ గురించి టాపిక్‌ రావాలంటే ఆ అమ్మాయి చేస్తున్న ప్రాజెక్ట్‌ లేదా పర్సనల్‌ విషయం బైటికి వచ్చినప్పుడు టాపిక్‌ వస్తుంది. కానీ ఇప్పుడు ఏ సినిమా గురించి మాట్లాడినా శ్రీలీల టాపిక్‌ వస్తోంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 8 ప్రాజెక్ట్‌లు లైన్‌లో పెట్టింది శ్రీలీల. ఆ సినిమాలకు సంబంధించి ఏ అప్‌డేట్‌ వచ్చినా ఆ సినిమాలో శ్రీలీల ఉంది కాబట్టి అంతా ఆమె గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి సినిమాల్లో శ్రీలీల ఉంది. మహేష్‌ బాబు గుంటూరు కారం, పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, బాలకృష్ణ భగవంత్‌ కేసరి, VD12, నితిన్‌32, ఆదికేశవ, బోయాటి-రాపో, అనగనగా ఒక రాజు అంటూ ఫుల్‌ బిజీ షెడ్యూల్‌లో ఉంది.

తన బిజీకి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్‌ కూడా చార్జ్‌ చేస్తోంది. ఒక రోజుకు రెమ్యునరేషన్‌ నాలుగు లక్షలు తీసుకుంటున్నట్టు టాక్‌. రెమ్యూనరేషన్‌ సంగతి పక్కన పెడితే. ప్రస్తుతం ఎటు చూసినా శ్రీలీలే కనిపిస్తోంది అంటున్నారు టాలీవుడ్‌ ఆడియన్స్‌. అన్ని పోస్టర్లలో శ్రీలీలే ఉండటంతో కళ్లు మూసుకున్నా ఆమే కనిపిస్తోంది అంటూ ఇంటర్నెట్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. రీసెంట్‌గా ఇన్ని సినిమా ఆఫర్లు వరుసగా కొట్టేసిన హీరోయిన్‌ శ్రీలీల తప్ప మరెవరూ లేరు. ప్రస్తుతం కెరీర్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న శ్రీలీల ఏ పొజిషన్‌కు వెళ్లిపోతుందో చూడాలి.