Sreeleela: అసలు ఏమైంది..? కోట్ల రూపాయలు వదులుకుంటున్న శ్రీలీల

పెళ్లి సందడి మూవీతో తన సినీ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ప్పుడు టాక్ ఆఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీగా మారింది. శ్రీలీల ఇటీవలే ఒక బడా హీరో మూవీని రిజెక్ట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఆ మూవీలో ఉన్న ఒక ఐటెం సాంగ్‌ని శ్రీలీల చేత చేయించాలని మేకర్స్ సంప్రదించారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 9, 2024 | 03:36 PMLast Updated on: Mar 09, 2024 | 3:36 PM

Sreeleela Not Doing Any Films Right Now And Rejected An Item Song From Big Movie

Sreeleela: ఒక్క అవకాశం.. ఒకే ఒక్క అవకాశం.. తెలుగు సినిమా పరిశ్రమలో తరచూ వినపడే మాట ఇది. ఆ ఒక్క అవకాశం వస్తే చాలు ఇంక తెలుగు సినిమాని ఏలొచ్చు అనుకుంటారు చాలామంది. ఇలా ఒక్క అవకాశంతో తమ సత్తా చాటి.. అగ్ర హీరోయిన్లుగా ఎదిగిన నటీమణులు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఒకరు శ్రీలీల. పెళ్లి సందడి మూవీతో తన సినీ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ప్పుడు టాక్ ఆఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీగా మారింది.

Prabhas: రాజాసాబ్.. ఆ రేంజ్‌లో ఉంటుందా.. అంచనాలు పెంచేస్తున్న నటుడి కామెంట్స్

శ్రీలీల ఇటీవలే ఒక బడా హీరో మూవీని రిజెక్ట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఆ మూవీలో ఉన్న ఒక ఐటెం సాంగ్‌ని శ్రీలీల చేత చేయించాలని మేకర్స్ సంప్రదించారట. కానీ దీనికి ఆమె నో చెప్పినట్టు సమాచారం. నిర్మాతలు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్దపడినా కూడా.. ఆమె నో చెప్పిందని అంటున్నారు. గతంలో అల్లు అర్జున్ పుష్ప 2 లోని ఐటెం సాంగ్‌కి కూడా ఆమె ఒప్పుకోలేదనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఐటెం సాంగ్స్ చేయడానికి శ్రీలీల ఇష్టపడటం లేదని, అందుకే ఆమె ఆ ఆఫర్ రిజెక్ట్ చేస్తునట్టు చెప్తున్నారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఎమ్‌బి‌బిఎస్‌కి ప్రిపేర్ అవ్వడం కోసం ఆమె ఎలాంటి కొత్త చిత్రాల షూటింగ్్లో పాల్గొనడం లేదు.

శ్రీ లీల నుంచి గత ఏడాది స్కంధ, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీలు వచ్చాయి. వాటిల్లో భగవంత్ కేసరి హిట్ అవ్వగా మిగిలిన మూడు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. కాకపోతే ఈ ఏడాది మాత్రం మహేష్‌తో కలిసి చేసిన గుంటూరు కారం ఒక మోస్తరు విజయాన్ని అందించింది. పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే తన చేతిలో ఉంది.