Sreeleela: వహ్వా శ్రీలీల.. ఆ సీన్స్ చేయనన్న శ్రీలీల.. అందుకే ఔట్

డజను సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఆ మధ్య విజయ్ దేవరకొండ సినిమా నుంచి ఔట్ అనే ప్రచారం జరిగింది. బ్యూటీ తప్పుకుందా.. వాళ్లే తప్పించారో అప్పట్లో తెలియదు. కానీ, శ్రీలలను ఎందుకు వదిలేసుకున్నారనే డిస్కషన్ నడిచింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 17, 2023 | 02:11 PMLast Updated on: Nov 17, 2023 | 2:11 PM

Sreeleela Rejected Vijay Devarakonda Movie Here Is The Reason

Sreeleela: ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఆమెచుట్టూ చక్కర్లు కొడుతోంది. ఆమె కాల్షీట్ల కోసం కాచుకు కూచున్న వారెందరో. ఇలాంటి టైమ్‌లో ఓ మూవీ నుంచి ఔట్ అంటూ కొన్ని రోజుల క్రితం వచ్చిన న్యూస్ చూసి షాక్ అయ్యారంతా. కానీ అందుకు కారణం ఏంటో తెలిసాక మాత్రం ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అసలేం జరిగందంటే.. శ్రీలీల వరుస ఆఫర్స్‌తో టైమ్ చూసుకునే టైమ్ లేనంత బిజీగా ఉంది. ధమాకా మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ కొట్టేసి చాలామంది హీరోయిన్స్‌కి చెక్ పెట్టేసింది.

Chiranjeevi: మెగా ప్లానింగ్.. సరికొత్త ఊహా ప్రపంచంలోకి చిరంజీవి..

దాదాపు డజను సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఆ మధ్య విజయ్ దేవరకొండ సినిమా నుంచి ఔట్ అనే ప్రచారం జరిగింది. బ్యూటీ తప్పుకుందా.. వాళ్లే తప్పించారో అప్పట్లో తెలియదు. కానీ, శ్రీలలను ఎందుకు వదిలేసుకున్నారనే డిస్కషన్ నడిచింది. అయితే అసలు విషయం నెమ్మదిగా బయటపడడంతో వహ్వా శ్రీలల అంటున్నారంతా. కొంతమందికి ఆఫర్లే టార్గెట్. మరికొంతమందికి మంచి క్యారెక్టర్లు టార్గెట్. రెండో రకానికి చెందిన వాళ్లలో సాయపల్లవి, నిత్యామీనన్‌లాంటి వాళ్లున్నారు. ఇప్పుడీ లిస్టులో చేరింది శ్రీలీల. ఆఫర్లు ఇంపార్టెంటే కానీ షరతులు వర్తిస్తాయని స్ట్రాంగ్‌గా చెప్పేస్తోందట శ్రీలల. విజయ్ దేవరకొండ సినిమా నుంచి తప్పుకునేందుకు ఇదే కారణం అని టాక్. VD 12 మూవికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శ్రీలీల బాండ్‌పై సైన్ కూడా చేసింది.

కానీ ఆ తర్వాతే తెలిసిందట ఆ మూవీలో విజయ్‌తో లిప్ లాక్ సీన్లు, బెడ్ రూమ్ సీన్లు ఉన్నాయని. ఈ విషయం ముందు ఎందుకు చెప్పలేదని డైరెక్టర్‌ని అడిగిన శ్రీలీల తాను చేయనని చెప్పిందట. అగ్రిమెంట్ మీద సైన్ చేసింది కాబట్టి అది బ్రేక్ చేయాలి అంటే 30 లక్షలు తిరిగివ్వాలి. దానిబదులు నటించడమే బెటర్ కదా అన్నాడట డైరెక్టర్. కానీ శ్రీలీల మాత్రం ఆ డబ్బులు కట్టేసి మరీ బయటకు వచ్చేసిందట. అప్పట్లో శ్రీలీల డేట్స్ అడ్జెస్ట్ చేయలేక తప్పుకుందనే ప్రచారం జరిగింది కానీ.. అసలు విషయం ఇది అని ఆలస్యంగా బయటపడింది. ఇది తెలిసిన ఆడియన్స్ సాయిపల్లవి తర్వాత శ్రీలీలే అని పొగిడేస్తున్నారు.