Sreeleela: భగవంత్ కేసరితో శ్రీలీల నటిగా నిరూపించుకుంటుందా..?

శ్రీలీల బాగా డ్యాన్స్‌ చేస్తుంది. ఎనర్జిటిక్‌గా కనిపిస్తుందన్న ప్రశంసలు తప్ప పాత్రకు ప్రాణం పోసిందన్న మాట ఇంతవరకు తెచ్చుకోలేదు. కొద్దో, గొప్పో.. పెళ్లిసందడిలోనే కాస్త ఐడెంటిటీ దక్కింది. ఆ తర్వాత వచ్చిన ధమాకా, స్కందలో పాటలకు, నాలుగైదు సీన్స్‌కు పరిమితమైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 11, 2023 | 08:08 PMLast Updated on: Oct 11, 2023 | 8:08 PM

Sreeleela Will Prove As Actress With Bhagavanth Kesari

Sreeleela: శ్రీలీల వరుసపెట్టి సినిమాలు చేసేస్తోంది. చిన్న హీరో, పెద్ద హీరో అన్న తేడా లేకుండా అందరితో జత కడుతోంది. మంచి ఫాలోయింగ్‌తో బిజీగా ఉంది. అంతా బాగానే వున్నా.. గుర్తుండిపోయే పాత్రలు ఎందుకు చేయడం లేదు. క్వాంటిటీనే చూసుకుంటోందిగానీ.. క్యారెక్టర్‌లో క్వాలిటీ గురించి ఈ అమ్మడికి పట్టదా..? ఇలాంటి విమర్శలకు భగవంత్‌ కేసరి సమాధానం ఇస్తుందా..? పెర్ఫార్మెన్స్‌తో మెప్పించగలదా..? శ్రీలీల బాగా డ్యాన్స్‌ చేస్తుంది. ఎనర్జిటిక్‌గా కనిపిస్తుందన్న ప్రశంసలు తప్ప పాత్రకు ప్రాణం పోసిందన్న మాట ఇంతవరకు తెచ్చుకోలేదు.

కొద్దో, గొప్పో.. పెళ్లిసందడిలోనే కాస్త ఐడెంటిటీ దక్కింది. ఆ తర్వాత వచ్చిన ధమాకా, స్కందలో పాటలకు, నాలుగైదు సీన్స్‌కు పరిమితమైంది. ధమాకా, స్కంద రిలీజ్‌ తర్వాత శ్రీలీల ఓ పదేళ్లు ఇండస్ట్రీలో వుంటుందా..? క్రేజీ హీరోయిన్‌ ఇమేజ్‌ కంటిన్యూ చేస్తుందా..? అన్న అనుమానం వచ్చింది. గ్లామర్‌ ఇమేజ్‌తో తళుక్కున మెరవడం తప్ప నటిగా ఇరగదీసిందన్న సీన్‌ ఇంతవరకు పడలేదు. అయితే.. భగతవంత్‌ కేసరి వీటన్నింటికీ సమాధానం చెబుతుందా అనిపిస్తోంది. రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన ట్రైలర్‌లో కథ అంతా శ్రీలీల చుట్టూనే తిరిగింది. కథకు మూలంగా నిలిచింది శ్రీలీల.

ట్రైలర్‌లో యాక్టింగ్‌కు స్కోప్‌ వున్న రోల్‌ దక్కిందనిపిస్తోంది. మరి రాక రాక వచ్చిన ఈ అవకాశాన్ని యూజ్‌ చేసుకుని.. మంచి పెర్ఫార్మర్‌ అనిపించుకుంటుందా..? నాలుగు స్టెప్పులు.. నాలుగు గ్లామర్‌ సీన్స్‌కే కాదు.. అభినయంతో ఇంప్రెస్‌ చేయగలదా..? వీటన్నింటికి భగవంత్‌ కేసరిలో సమాధానం దొరకనుంది.