Sreeleela: శ్రీలీల ఉంటే.. దుమ్ము లేచిపోయినట్లే..

డేంజర్‌ సాంగ్‌లో శ్రీలీల జస్ట్ అలా కనిపించి మాయమైపోయింది. జనాల్లోకి బాగా వెళ్లడానికి శ్రీలీలను రంగంలోకి దింపారు మేకర్స్‌. సాంగ్‌కు కొరియోగ్రఫీ ఇచ్చిన శేఖర్‌ మాస్టారుతో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోను రిలీజ్‌ చేస్తే వైరల్‌ అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 16, 2023 | 04:19 PMLast Updated on: Aug 16, 2023 | 4:19 PM

Sreeleelas Danger Pilla Song From Extra Ordinary Man Released

Sreeleela: సినిమాకు హైప్‌ రావడం లేదా..? జనాల్లోకి వెళ్లడం లేదా..? అయితే, శ్రీలీలను బరిలోకి దింపితే చాలు. పెద్దగా కష్టపడకుండా సినిమాకు మంచి ప్రమోషన్‌ తీసుకొస్తుంది. శ్రీలీల చాలా డేంజర్‌ అని నితిన్‌ ముందే గ్రహించాడనుకుంట. డేంజర్‌ పిల్ల అంటూ సాంగ్‌ పాడేశాడు. ఈ ఇద్దరూ జంటగా ‘ఎగస్ట్రా’ మూవీ రూపొందుతోంది. బన్నీతో నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా తీసిన రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ వక్కంతం వంశీ ఈ మూవీని తీస్తున్నాడు. డేంజర్‌ పిల్ల అంటూ సాగే ఫస్ట్‌ సాంగ్‌ను రీసెంట్‌గా రిలీజ్‌ చేశారు.

డేంజర్‌ సాంగ్‌లో శ్రీలీల జస్ట్ అలా కనిపించి మాయమైపోయింది. జనాల్లోకి బాగా వెళ్లడానికి శ్రీలీలను రంగంలోకి దింపారు మేకర్స్‌. సాంగ్‌కు కొరియోగ్రఫీ ఇచ్చిన శేఖర్‌ మాస్టారుతో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోను రిలీజ్‌ చేస్తే వైరల్‌ అయింది. శేఖర్‌ మాస్టర్‌ కంటే శ్రీలీలే డ్యాన్స్‌ బాగా చేసిందన్న కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. స్వతహాగా మంచి డ్యాన్సర్‌ అయిన శ్రీలీల ఎలాంటి కష్టమైన స్టెప్పునైనా ఈజీగా చేసేస్తోంది. స్కంధ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లిరికల్‌ వీడియో సూపర్‌హిట్‌ అయింది. ఈ పాటలో రామ్‌కు ధీటైన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. అంతేకాదు.. పర్సనల్‌గా డ్యాన్స్‌ చేసిన వీడియోను కూడా షేర్‌ చేసింది శ్రీలీల.

ఎగస్ట్రా మూవీలోని డేంజర్‌ పిల్లను ప్రమోట్ చేయడానికి శ్రీలీల, శేఖర్ మాస్టర్ ముందుకొచ్చి డ్యాన్స్‌ చేశారు. ఈ సాంగ్ రీల్ సూపర్‌గా చేస్తే, ఆ వీడియోని ఆదిత్య మ్యూజిక్ అఫీషియల్‌గా షేర్ చేస్తుందంటున్నారు. డేంజర్ పిల్లా కాంటెస్ట్ అంటూ ట్యాగ్ చేయమంటున్నారు మేకర్స్‌.