ఖాన్ హీరోలు శ్రీదేవి ముందు జూజూబీలా…? ముగ్గురూ కలిసినా

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 13, 2024 | 04:54 PMLast Updated on: Aug 13, 2024 | 4:54 PM

Sridevi Birth Anniversary

ఇండియన్ సినిమా చరిత్రలో శ్రీదేవి అనే పేరు ఒక సంచలనం. అగ్ర నటులకు, రాజకీయ నాయకులకు మరే ఇతర రంగంలో కూడా శ్రీదేవి స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించలేదు. ఆమె తెరపై కనపడితే చాలు ఆడ లేదు మగా లేదు… చిన్నా లేదు పెద్ద లేదు “శ్రీదేవి”ని చూడటానికే సినిమా థియేటర్ కు క్యూ కట్టేవారు జనాలు. హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు… మైమరిపించే నటన కూడా ఉంటుందని ఇండియన్ సినిమాకు ఘనంగా చాటి చెప్పిన క్వీన్ శ్రీదేవి. అలాంటి శ్రీదేవి అనూహ్యంగా మరణించారు. ఎవరి ఊహకు అందని విధంగా అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎప్పటికీ ఒక మిస్టరీనే.

నేడు శ్రీదేవి జయంతి కావడంతో ఆమె అభిమానులు, స్నేహితులు ఆమె జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. ఈ సమయంలో మేము కూడా శ్రీదేవి గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు పంచుకొబోతున్నాం. ఆ విషయాలు ఏంటీ, ఇండియన్ సినిమాలో ఏకైక లేడీ సూపర్ స్టార్ గురించి ఫ్యాన్స్ కి కూడా తెలియని విషయాలు ఏంటో చూద్దాం.

బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ ముగ్గురు కలిపినా శ్రీదేవి చేసినన్ని సినిమాల్లో నటించలేదు. శ్రీదేవి 300 సినిమాల్లో నటించింది.

ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌ బర్గ్ తో సినిమా చేయడానికి శ్రీదేవి నిరాకరించింది. స్టీవెన్ స్పీల్‌ బర్గ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘జురాసిక్ పార్క్’లో ఒక చిన్న పాత్ర కోసం ఆమెను సంప్రదించగా… అది తన స్థాయికి సరిపడని పాత్ర అని భావించిన శ్రీదేవి ఆ పాత్రను తిరస్కరించింది.

103 డిగ్రీల జ్వరంతో ‘నా జానే కహాన్ సే ఆయీ హై’ సాంగ్ షూటింగ్ లో పాల్గొంది శ్రీదేవి.

తన భర్త బోనీ కపూర్ నిర్మించిన చిత్రాలు… ‘జుదాయి’, ‘హమారా దిల్ ఆప్కే పాస్ హై’లోని హీరోయిన్ల పాత్రల పేర్లను తన కూతుళ్ళకు పెట్టారు ఆమె.

‘సద్మా’, ‘చాందిని’, ‘గరాజన’ మరియు ‘క్షణ క్షణం’ చిత్రాలలో ప్లేబ్యాక్ సింగర్ గా కూడా శ్రీదేవి మెప్పించింది.

శ్రీదేవికి ముందు హిందీ వచ్చేది కాదు. కాని బాలీవుడ్ లో ఆఫర్లు రావడంతో… హిందీ డబ్బింగ్ కష్టం కావడంతో పలు సినిమాలకు రేఖ శ్రీదేవికి డబ్బింగ్ చెప్పారు.

రజనీ కాంత్ హీరోగా వచ్చిన మూండ్రు ముడిచు చిత్రంలో కేవలం 13 సంవత్సరాల వయస్సులో సవతి తల్లిగా కనిపించి సంచలనం సృష్టించింది.

పెయింటింగ్ విషయంలో శ్రీదేవిని సల్మాన్ ఖాన్ ప్రోత్సహించారు. ఆమె పెయింటింగ్ కు అంతర్జాతీయ స్థాయికి గుర్తింపు వచ్చింది. ఆమె పెయింటింగ్ ‘థాట్స్’ను ప్రఖ్యాత అంతర్జాతీయ ఆర్ట్ వేలం హౌస్ అంగీకరించడం అప్పట్లో సంచలనం.

శ్రీదేవి నిర్మాతగా కూడా సినిమాలను నిర్మించారు. షారుఖ్ ఖాన్ నటించిన ‘శక్తి: ది పవర్’ సినిమా శ్రీదేవి నిర్మాణ సారధ్యంలో వచ్చింది. ఆ సినిమాలో నటించాల్సి ఉన్నా… గర్భవతి కావడంతో నటించలేకపోయింది.