Srileela: ఇదెక్కడి క్రేజ్‌రా నాయనా.. శ్రీలీలను బాగానే వాడేస్తున్నారుగా..

టాలీవుడ్‌లో మోస్ట్‌ హ్యాపెనింగ్ హీరోయిన్ అంటే.. ఇప్పుడు శ్రీలీలనే ! మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌.. ఇలా బడా హీరోల సినిమాలకు సైన్‌ చేసేసిందీ అమ్మడు. శ్రీలీల డేట్స్ దొరకడం కూడా కష్టంగానే మారింది. స్టార్ హీరోలంతా కూడా శ్రీలీల పేరు జపిస్తున్నట్టు టాక్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2023 | 01:45 PMLast Updated on: Apr 08, 2023 | 1:45 PM

Srileela Has Very Populor Actress In Tollywood

స్టార్ హీరోల సినిమాల్లో శ్రీలీల ఫస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. బడా సంస్థలు కూడా శ్రీలీలను తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయ్. ధమాకా తర్వాత శ్రీలీల గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఆమె క్యూట్‌నెస్‌కు, డ్యాన్స్‌ మూమెంట్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. శ్రీలీల ఉంటే చాలు.. సినిమా హిట్ అన్న రేంజ్‌కు వెళ్లిపోయింది క్రేజ్‌. ధమాకా వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. దీంతో ఇప్పుడు ఆమె పాత సినిమాల మీద జనాలు ఫోకస్ పెట్టారు.

శ్రీలీల కన్నడలో మొదటగా నటించిన కిస్ సినిమా.. ఇక్కడ ఐ లవ్ యూ ఇడియట్ అంటూ విడుదలైంది. ఈ మూవీలో ఆహా ఓటీటీలో ప్రత్యక్షం అయింది. ఐ లవ్ యూ ఇడియట్ సినిమా.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కింది. సినిమాలో శ్రీలీల అందాలు, డ్యాన్సులు సినిమాను నిలబెట్టేశాయ్. ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలో అందరినీ ఆకట్టుకుంటోంది. నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

క్రేజ్‌ను వాడుకోవడంలో సినిమా ఇండస్ట్రీ తర్వాతే ఎవరైనా అని శ్రీలీల సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. దీపం ఉన్నప్పుడు ఇళ్లు సర్దుకోవాలి అనుకున్నట్లు.. క్రేజ్ ఉన్నప్పుడే దాన్ని వాడేయాలి. జనాల్లోకి వెళ్లాలి. దీనికోసం శ్రీలీల పాత సినిమాల లిస్ట్ రెడీ చేస్తున్నారు నిర్మాతలు. దీంతో ఆమెను బాగానే వాడేస్తున్నారుగా అనే డిస్కషన్‌ ఫ్యాన్స్‌లో మొదలైంది.