Sree Leela: రష్మిక ప్లేస్ కొట్టేసిన శ్రీలీల
మొన్నటివరకు తిరుగులేని విధంగా దూసుకెళ్లిన రష్మికకి.. ఇప్పుడీ కొత్త బ్యూటీ బ్రేకులు వేస్తోంది. ఆమె శ్రీలీల.

Srileela is a young beauty who has taken Rashmika's place in Tollywood
శ్రీలీల హవా నడుస్తోందిప్పుడు టాలీవుడ్‌లో. నేషనల్ క్రష్ రష్మికు శ్రీలీల పోటీగా మారుతోంది. మొన్నటివరకు తిరుగులేని విధంగా దూసుకెళ్లిన రష్మికకి.. ఇప్పుడీ కొత్త బ్యూటీ బ్రేకులు వేస్తోంది. రష్మిక అవకాశాలన్నింటినీ శ్రీలీల తన్నుకుపోతోంది. రష్మిక మందనకు నేషనల్ క్రష్ అని పేరు. స్పీడ్‌గా పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. వరుస విజయాలు రష్మికను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాయ్. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నాలుగేళ్లలోనే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. కన్నడ నుంచి కెరీర్ స్టార్ట్ చేసిన రష్మిక.. అక్కడి నుంచి తెలుగులోకి.. ఆ తర్వాత తెలుగు, హిందీలోకి వెళ్లింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ఈ సినిమాలోని శ్రీవల్లి పాత్ర మాత్రం ఇండియా దాటి గ్లోబల్‌వైడ్‌గా పాపులర్ అయింది.
ఇక అటు ఒక్క సినిమాతోనే క్రేజీ బ్యూటీగా మారింది శ్రీలీల. యంగ్ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్‌లోకి సునామీలా దూసుకొచ్చింది. ధమాకా మూవీతో ఈ బ్యూటీ రేంజ్ మారిపోయింది. ఆ సినిమా హిట్ కావడంతో.. అమ్మడుకు అవకాశాలు క్యూ కడుతున్నాయ్. సుమారు పది సినిమాలు శ్రీలీల చేతిలో ఉన్నాయ్. ఇంకా కొత్త అవకాశాలు క్యూ కడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ వరించింది.
నితిన్‌తో మరో అవకాశాన్ని దక్కించుకుంది శ్రీలీల. ఇప్పటికే ఎక్స్‌ట్రా చిత్రంలో నితిన్‌తో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమా డిసెంబర్‌లో రాబోతుంది. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ శ్రీలీలకి వరించింది. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో శ్రీలీల సెలక్ట్ అయిందని తెలుస్తోంది. మొదట ఈ సినిమాలో రష్మికనే హీరోయిన్. ప్రోమో కూడా రిలీజ్ చేసారు. భీష్మ హిట్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కించాలనుకున్నారు. ఐతే సడెన్‌గా సినిమా నుంచి తప్పుకుంది రష్మిక. ఐతే ఇప్పుడు రష్మిక ప్లేస్‌ను శ్రీలీల కొట్టేసింది.