Sri Leela: 6 నెలల్లో 5 సినిమాలు.. శ్రీలీలది మాములు క్రేజ్ కాదుగా..
టాలీవుడ్‌లో ఏం నడుస్తుంది అంటే.. శ్రీలీల హవా నడుస్తుంది బాస్ అంటున్నారు ఎవరిని అడిగినా ! అమ్మడి అందానికి, ముద్దుముద్దు మాటలకు, స్టెప్పులకు కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు.

Srileela is jumping into Tollywood with a series of film offers
యూత్‌లో శ్రీలీలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే వరుస అవకాశాలు ఈ బ్యూటీ తలుపు తడుతున్నాయ్. పెళ్లిసందడి మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయిన శ్రీలీల.. ధమాకా సినిమాతో మంచి హిట్ అందుకుంది. రవితేజ ఎనర్జీకి దీటుగా యాక్టింగ్‌తో అదరగొట్టింది శ్రీలీల. ఈ మూవీలో శ్రీలీలను చూసి టాలీవుడ్ అంతా ఫిదా అయింది. అందుకే అవకాశాలు క్యూ కట్టాయ్. శ్రీలీల వచ్చాక.. అప్పటివరకు టాప్ అనుకున్న హీరోయిన్లు అంతా.. అంతా సర్దేసుకున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పది సినిమాలు ఉన్నాయ్.
అందులో 8 సినిమాలు తెలుగువే ! ఉస్తాద్ భగత్ సింగ్, భగవంత్ కేసరి, గుంటూరు కారం, విజయ్ దేవరకొండ 12వ చిత్రం, స్కంద, నితిన్ ఎక్స్‌ట్రా, ఆదికేశవ, అనగనగా ఒక రాజు చిత్రాల్లో నటిస్తోంది.
ఈ మూవీస్ అన్ని దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయ్. పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నవి కొన్ని అయితే.. ఇంకొన్ని వారాల్లో విడుదలకు సిద్ధంగా ఉన్నవి మరికొన్ని. టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీలీల హవా నడుస్తుండగా.. రాబోయే ఆరు నెలలు కూడా ఇదే సీన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయ్. ఈ నెల నుంచి సరిగ్గా సంక్రాంతి వరకు లెక్క తీస్తే.. ఆరు నెలల్లో శ్రీలీలవి ఐదు సినిమాలు విడుదల కాబోతున్నాయ్. అవీ భారీ బడ్జెట్ సినిమాలు, టాప్ హీరోల సినిమాలు కావడం హైలైట్. ఆదికేశవతో స్టార్ట్ చేస్తే..
స్కంధ, భగవత్ కేసరి, ఎక్స్‌ట్రా, గుంటూరు కారం.. ఇలా శ్రీలీల ఏదో ఒక సినిమాలో వచ్చే ఆరు నెలలు థియేటర్‌లలో సందడి చేయడం ఖాయం. చేస్తూ చేస్తున్న గుంటూరు కారం హిట్ అయితే శ్రీలీల రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆమె రెమ్యూనరేషన్ నాలుగు కోట్లు అయినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం రెమ్యునరేషన్ పెంచేసిన ఈ బ్యూటీ.. మరి ఈ ఆరు సినిమాల తర్వాత ఏ రేంజ్‌కు వెళ్తుందో