Srinu Vaitla: వెంకీ 2పై క్రేజీ అప్‌డేట్‌ చెప్పిన శ్రీను వైట్ల.. వర్కవుట్ అవుతుందా..?

2004లో వచ్చిన వెంకీ సినిమాకి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆ సినిమాలో కామెడీ ట్రాక్స్ సూపర్ హిట్ అయ్యాయి. మంగళవారానికి ఈ సినిమా రిలీజై 20 ఏళ్లు పూర్తయ్యాయి. రీసెంట్‌గా ఈ మూవీపై దర్శకుడు శ్రీను వైట్ల స్పందించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2024 | 05:25 PMLast Updated on: Mar 26, 2024 | 5:25 PM

Srinu Vaitla Announced Ravi Tejas Venky Movie Seques Venky 2

Srinu Vaitla: కామెడీ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్లలో శ్రీను వైట్లకు బాగా పేరుంది. సీరియస్ కథను కూడా ఎంటర్‌టైన్‌గా చెప్పడంలో శ్రీను వైట్ల ఇప్పటికే ఎన్నోసార్లు సక్సెస్ అయ్యాడు. రవితేజ హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన వెంకీ మూవీ ఆ రోజుల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. 2004లో వచ్చిన వెంకీ సినిమాకి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆ సినిమాలో కామెడీ ట్రాక్స్ సూపర్ హిట్ అయ్యాయి. మంగళవారానికి ఈ సినిమా రిలీజై 20 ఏళ్లు పూర్తయ్యాయి.

RAM CHARAN-SUKUMAR: చరణ్ సినిమాపై రాజమౌళి కామెంట్స్.. మరో ఇండస్ట్రీ హిట్ ఖాయం..!

రీసెంట్‌గా ఈ మూవీపై దర్శకుడు శ్రీను వైట్ల స్పందించాడు. వెంకీ2 పై గుడ్‌‌న్యూస్‌ చెప్పాడు. ఈ న్యూస్ ఇప్పుడు కామెడీ ఆడియెన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది. వెంకీ మూవీకి సీక్వెల్‌ తీసుకురాబోతున్నట్టు శ్రీను వైట్ల తెలిపాడు. ఇటీవల వెంకీ సినిమా రీ రిలీజ్‌ టైమ్‌లో వచ్చిన స్పందన, ఆడియెన్స్ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని, తనకు సీక్వెల్‌ తీయాలనే ఆలోచన వచ్చిందట. ఆల్‌రెడీ స్క్రిప్ట్‌ పై వర్క్ చేస్తున్నట్టు తెలిపాడు శ్రీనువైట్ల. మళ్లీ అదే కాంబినేషన్‌లో సినిమా ఉంటుందంటూ ఆడియన్స్‌కు హైప్ క్రియేట్ చేశాడు. కానీ ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేనన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. శ్రీను వైట్ల కామెంట్స్‌తో రవితేజ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నప్పటికీ.. కామన్ ఆడియెన్స్ మాత్రం.. శ్రీను వైట్ల ప్రజెంట్ ఉన్న ఫామ్‌కి ఇది సాధ్యమయ్యే పనేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు శ్రీను వైట్ల. వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి చిత్రాలతో అతను భారీ విజయాలను అందుకుని టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా ఉండేవాడు వైట్ల. కానీ ‘దూకుడు’ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన మహేష్ బాబుతో తీసిన ‘ఆగడు’ సినిమా డిజాస్టర్ అయ్యాక ఆయన కెరీర్ తిరగబడింది. ఆ తర్వాత శ్రీను వైట్ల నుంచి వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి. ఇక.. ప్రస్తుతం రవితేజ.. మిస్టర్‌ బచ్చన్‌ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఫెయిల్యూర్‌లో ఉన్న శ్రీనువైట్లతో రవితేజ సినిమా చేస్తాడా? అనేది డౌట్‌గా మారింది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.