శ్రీతేజ్‌కు మెమోరీ లాస్? అల్లు అర్జున్ సంచలన నిర్ణయం
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ పిల్లాడు శ్రీతేజ్ పరిస్థితి ఇప్పటీ కుదుటపడటంలేదు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డప్పటికీ ఇంకా పరిస్థితి పూర్తిగా సెట్ అవ్వలేదు. దీంతో శ్రీతేజ్ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ పిల్లాడు శ్రీతేజ్ పరిస్థితి ఇప్పటీ కుదుటపడటంలేదు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డప్పటికీ ఇంకా పరిస్థితి పూర్తిగా సెట్ అవ్వలేదు. దీంతో శ్రీతేజ్ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. శ్రీతేజ్కు మరింత మెరుగైన వైద్యం అందించడానికి విదేశాలకు తీసుకెళ్లాలని అల్లు అర్జున్ డిసైడ్ అయినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో శ్రీతేజ్ను ప్రాణాపాయం నుంచి బయటపడేయాలని, శ్రీతేజ్ను కాపాడుకోవాలని బన్నీ డిసైడ్ అయినట్లు సమాచారం. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ను రీసెంట్‌గా నిర్మాత బన్నీ వాసు మరోసారి పరామర్శించారు.
శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడటంతో బన్నీ వాసు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీతేజ్కు మరింత మెరుగైన వైద్యం అందించడానికి ఫారెన్ తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులను గుర్తించడం లేదని, పలకరిస్తే ప్రతిస్పందన చూపించడం లేదని కిమ్స్ వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. శ్రీతేజ్ ఆసుపత్రి పాలై ఇప్పటికే దాదాపు రెండు నెలలయింది. కిమ్స్ హాస్పిటల్ వంటి ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎంత ఖర్చయినా చూసుకుంటామని అల్లు అర్జున్ ప్రకటించాడు. అయినప్పటికీ ఇప్పటికీ శ్రీతేజ్ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. దీంతో.. విదేశాలకు తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించడమే మేలనే అభిప్రాయానికి అల్లు అర్జున్ వచ్చినట్లు తెలిసింది. డిసెంబర్ 4, 2024న పుష్ప2 బెనిఫిట్‌షో రాత్రి 9.30 గంటలకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు పర్మిషన్ఇవ్వకున్నా అల్లు అర్జున్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోనిసంధ్య థియేటర్కు వెళ్లగా.. అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది.
ఆమె తొమ్మిదేండ్ల కొడుకు శ్రీతేజ్కోమాలోకి వెళ్లాడు. బ్రెయిన్కు తీవ్ర గాయం కావడంతో అప్పటి నుంచి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్ తెలంగాణ పాలిటిక్స్‌తో సినీ రంగంలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. ఏదైనా సినిమా ఈవెంట్ చేసుకోవాలి అంటేనే అంతా భయపడే పరిస్థితి వచ్చింది. రీసెంట్‌గా జరిగిన తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఫ్యాన్స్ ఆడియన్స్ ఎవరూ లేకుండా ఓన్లీ క్లోజ్డ్ ఆడిటోరియంలో చేశారు. ఇంతటి మార్పును తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తీసుకువచ్చిన ఘటన సంధ్య థియేటర్ తొక్కసలాట. ఆ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను కాపాడ్డానికి డాక్టర్లు దాదాపు రెండు నెలల నుంచి కష్టపడుతున్నారు. కానీ ఎలాంటి యూజ్ లేదు. దీంతో అల్లు అర్జున్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప యూనిట్ నుంచి ప్రభుత్వం నుంచి అల్లు అర్జున్ నుంచి ఆర్థిక సహాయం అందింది. కానీ ప్రాణం ముందు ఏదీ ఎక్కువ కాదు. ఈ కారణంగానే శ్రీతేజ్‌కు విదేశాల్లో చేయించే ట్రీట్‌మెంట్ ఖర్చు కూడా బన్నీనే భరించబోతున్నాడు.