పుష్ప2 ఎఫెక్ట్… శ్రీ వల్లితో పెళ్లంటే ఊ అంటాడా..?

శ్రీవల్లీ పుష్పరాజ్ కంటే కూడా ఎక్కువే ఫోకస్ అవుతోంది. పుష్ప2 లో సింగిల్ సీన్ లో డైలాగ్, సింగిల్ సాంగ్ లో పెర్ఫామెన్స్ కి జనం ఫిదా అయ్యారు. అంతవరకు బానే ఉంది. కాని తన పెళ్లి వచ్చే ఏడాది సమ్మర్ తర్వాతే అంటూ ప్రచారం మొదలైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 9, 2024 | 05:50 PMLast Updated on: Dec 09, 2024 | 5:50 PM

Srivalli Is Getting More Focus Than Pushparaj

శ్రీవల్లీ పుష్పరాజ్ కంటే కూడా ఎక్కువే ఫోకస్ అవుతోంది. పుష్ప2 లో సింగిల్ సీన్ లో డైలాగ్, సింగిల్ సాంగ్ లో పెర్ఫామెన్స్ కి జనం ఫిదా అయ్యారు. అంతవరకు బానే ఉంది. కాని తన పెళ్లి వచ్చే ఏడాది సమ్మర్ తర్వాతే అంటూ ప్రచారం మొదలైంది. ఇంతలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫాదర్ సీన్ లోకొచ్చాడు. రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరి మధ్య ఏదో ఉంది అన్న గాసిప్స్ నుంచి ఆ ఉన్నదే ఏడడుగులు నడిచేందుకు కారణమైందనే వరకు గుసగుసలు మారాయి. అంటే ఏది ఇక సీక్రెట్ కాదు.. అందుకే 2025 లో నేషనల్ రష్మిక, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇద్దరూ ఏడడుగులు నడవబోతున్నారన్నారు. కట్ చేస్తే సీన్లోకి విజయ్ ఫాదర్ ఎంట్రీ ఇచ్చాడు. తన పెళ్లిక గ్రీన్ కాదు రెడ్ సిగ్నల్ పడిందని తేల్చాడు…

పుష్ప తో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక, పుష్ప2 తో ఇప్పుడో ఇంటిదవ్వబోతోందన్నారు. కారణం విజయ్ దేవరకొండతో తన లవ్ జర్నీ, ఫ్యామిలీ జర్నీగా మారబోతోందని కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతోంది. ఎక్కడా అఫీషియల్ స్టేట్ మెంట్లు లేవు. కట్ చేస్తే సీన్ లోకి రౌడీ ఫాదర్ వచ్చాడు. పెళ్లి గిల్లీ జాన్ తా నై అని విలనీ రేంజ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు

విజయ్ దేవరకొండ అసలే లైగర్ నుంచి వరుస ఫ్లాపులతో డీలా పడ్డాడు. పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ లా దూసుకెళ్లాల్సిన తను ఎదగాల్సిన టైంలో ఫ్లాపులతో అసలుకే ఎసరొచ్చేలా, కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. సీన్ మారిపోయింది. దీంతో ఒకప్పటిలా దూకుడుగా కాకుండా నిధానంగా ఆచితూచి అడుగులేస్తున్నాడు

కాని రష్మిక మాత్రం వరుసగా పాన్ ఇండియా హిట్లతో, దూసుకెళుతోంది. ఇలాంటి టైంలో రష్మికతో, విజయ్ దేవరకొండ పెల్లి అంటూ ప్రచారం మొదలైంది. 2025 సమ్మర్ లో లేదంటే ఆగస్ట్ కి వీళ్లిద్దరు ఏడడుగులు నడుస్తారన్నారు…

ఈ విషయంలో రష్మిక ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే ప్రచారం జరిగింది. మధ్యలో పుష్ప 2 షూటింగ్ అంటూ బ్రేకులు పడ్డాయి కాని, లేదంటే రష్మిక, విజయ్ ఇద్దరిది ఈ ఏడాదే పెళ్లి జరిగిపోయేదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

విచిత్రం ఏంటంటే అందరూ ఓకే అన్నా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తండ్రి నుంచి గ్రీన్ సిగ్నల్ బదులు రెడ్ సిగ్నల్ వచ్చింది. వరుసగా సినిమాలు చేస్తూ గ్యాప్ లేకుండా విజయ్ బిజీ ఉన్నాడని, కాబట్టి ఇప్పట్లో విజయ్ పెళ్లి ప్రస్థావనకే ఛాన్స్ లేదని తేల్చాడు రౌడీ ఫాదర్… దీంతో శ్రీవల్లీ కి రౌడీ సామి సొంతమయ్యే టైం ప్రొలాంగ్ అయ్యేలా ఉంది.