Prabhas: సలార్‌తో దిమ్మ తిరగాల్సిందే.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇక పండగే..
కలెక్షన్ల విషయంలో పర్వాలేదనిపిస్తున్నా.. ఆదిపురుష్ ప్రభాస్ అభిమానులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. దీంతో మా బలమేదంటే అంటూ.. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వైపే చూస్తున్నారు ఫ్యాన్స్ అంతా !

Sriya Reddy says that Prashant Neel has created a unique empire for KGF film and Prabhas has also created a unique country for Salar's film.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న చిత్రం సలార్. ప్రభాస్ హీరో గా శ్రుతి హాసన్ హీరోయిన్ గా రూపొందుతున్న సినిమా లో నటి శ్రియా రెడ్డి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా లో శ్రియా రెడ్డి పాత్ర పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఐతే ఓ ఇంటర్వ్యూలో శ్రియా రెడ్డి.. సలార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేజీఎఫ్ సినిమాను మించి సలార్ ఉంటుందని.. కేజీఎఫ్ వేరు.. సలార్ వేరు అంటూ అమ్మడు ఇచ్చిన ఎలివేషన్.. ప్రభాస్ ఫ్యాన్స్ ను సంబరాల్లో ముంచుతోంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కోసం ఎలా అయితే ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారో.. అలాగే ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ కూడా ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించారు అంటూ చెప్పుకొచ్చింది.
సినిమాలోని ప్రభాస్, పృథ్వీరాజ్ పాత్రలు వేరే లెవల్ లో ఉంటాయని.. ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రపంచం మాదిరిగా కాకుండా సలార్ లో సరికొత్త ప్రపంచాన్ని చూస్తామని చెప్పింది. ఆ ప్రపంచం లో సృష్టించిన ప్రతి ఒక్క పాత్ర కూడా ప్రేక్షకుల మైండ్ బ్లోయింగ్ అన్నట్లుగా ఉంటాయని చెప్పింది. శ్రీయా రెడ్డి మాటలతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయ్. వింటేజ్ ప్రభాస్ ను చూసి చాలా రోజులు అయిందని.. ఒక్క చాన్స్, ఒక్క పాత్ర పడితే.. రికార్డులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవడం ఖాయం అంటూ అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు.