SS Raja Mouli: మహేశ్ బాబు మూవీ కథ ఎప్పుడో సిద్దం.. జక్కన్న మైండ్ గేమ్.. !
రాజమౌలి అప్పట్లలో బాహుబలి 3 ఉంటుందన్నాడు ఏమైంది. త్రిబుల్ఆర్ ఆస్కార్ రేసులో ఉన్నంతవరకు సీక్వెల్ ఉందన్నారు. తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. అలానే మహేశ్ బాబు మూవీ విషయంలో కూడా రాజమౌళి ప్రమోషన్ కోసం మైండ్ గేమ్ ఆడుతున్నాడట.

Rajamouli Super Star mahesh babu movie story
నిజానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు తో తను తీయాలనుకున్న మూవీ తాలూకు కథ ఎప్పుడో సిద్దమైందట. కేవలం స్క్రీన్ ప్లే మాత్రమే రాయలేదని తెలుస్తోంది. అలాంటిది కథ ఇంకా రెడీ కాలేదు, ఇంకా సౌత్ ఆఫ్రికన్ రైటర్ నవలనే ప్రేరణగా కథని ప్లాన్ చేస్తున్నాం అంటూ చెబుతోంది జక్కన్న ఫ్యామిలీ
ఇక మహేశ్ మూవీ కోసం స్టోరీని మూడు వెర్షన్లగా ప్లాన్ చేసి, ఏదో ఒకటి ఫైనల్ చేయటమా, మూడింటినీ కలిపి కొత్త కథ సిద్దం చేయటమా అనే చర్చ జరుగుతోంది
కాకపోతే, ఇదే విషయం లీకై మహేశ్ బాబు సినిమా 3 భాగాలంటూ ప్రచారం జరిగింది. సో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటంటే, మహేశ్ బాబుమూవీ కథ సిద్దమైంది. స్క్రీన్ ప్లే మాత్రమే భాకీ… అది దసరాలోగా రెడీ అవుతుందట. దసరాకి ఈ సినిమా లాంచ్ అవుతుందట.