RAM CHARAN-SUKUMAR: చరణ్ సినిమాపై రాజమౌళి కామెంట్స్.. మరో ఇండస్ట్రీ హిట్ ఖాయం..!

ఆర్సీ17 ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. మరోసారి సుకుమార్- రామ్ చరణ్- దేవీశ్రీ ప్రసాద్ కాంబోలో ఈ మూవీ రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇచ్చిన హైప్ అయితే మాములుగా లేదు. మరో అరుదైన చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోంది అంటూ క్యాప్షన్ అయితే జోడించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2024 | 05:12 PMLast Updated on: Mar 26, 2024 | 5:12 PM

Ss Rajamouli About Ram Charan And Sukumar Combo Movie

RAM CHARAN-SUKUMAR: రామ్ చరణ్ ఒక్కో సినిమాతో, కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. అందుకే గేమ్ ఛేంజర్ మూవీలో అధికారికంగా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. అయితే ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేదని బాధ పడుతున్న అభిమానుల కోసం చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఒక సాంగ్ విడుదల చేయబోతున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రకటించేశాడు. ఇక నుంచి రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి అన్నీ అప్‌డేట్స్ పండగనే చెప్పాలేమో.

Allu Arjun : బన్నీ బర్త్ డే కి డబుల్ ధమాకా!

ఎందుకంటే ఆర్సీ 16 పూజా కార్యక్రమం నిర్వహించడంతోపాటు, ఇప్పుడు ఆర్సీ17 మూవీ గురించి అధికారికంగా ప్రకటన రావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ 17వ మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్‌‌డేట్ కూడా వచ్చింది. ఆర్సీ17 ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. మరోసారి సుకుమార్- రామ్ చరణ్- దేవీశ్రీ ప్రసాద్ కాంబోలో ఈ మూవీ రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇచ్చిన హైప్ అయితే మాములుగా లేదు. మరో అరుదైన చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోంది అంటూ క్యాప్షన్ అయితే జోడించారు. తాము తీయబోయే సినిమా గురించి ఎవరైనా అలాగే చెప్పుకుంటారు అని లైట్ తీసుకోకండి. ఈ మూవీ గురించి చెప్పింది ఆ చిత్ర యూనిట్ మెంబర్స్ కాదు. దర్శకధీరుడు రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే ఆర్సీ 17 గురించి రాజమౌళి కొన్ని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

అసలు జక్కన్న ఆర్సీ17 గురించి ఏం చెప్పాడంటే.. రామ్ చరణ్- సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమాకి సంబంధించి నాకు ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి తెలుసని.. ఇప్పుడు దాని గురించి చెప్పనని.. చెబితే సుకుమార్‌కి హార్ట్ అటాక్ వచ్చేస్తుందన్నారు. కానీ, ఆ మూవీ ఓపెనింగ్ సీక్వెన్స్ చూసిన తర్వాత ప్రేక్షకుల సీటు ఎడ్జ్‌కి వచ్చేస్తారు” అంటూ రాజమౌళి ఆర్సీ17 గురించి హైప్ పెంచేశాడు. ప్రస్తుతం.. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ మూవీ రంగస్థలానికి మించి హిట్టు కొడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆర్సీ 16, ఆర్సీ 17 ప్రాజెక్ట్స్ నుంచి మాత్రం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఉండాలి అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.