SS RAJAMOULI: జెట్ స్పీడ్‌లో మహేశ్, చరణ్ సినిమాలు.. డైరెక్టర్లు బిజీ..
ఈ మూవీకి కథని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తే, జక్కన్నే కథనం రాసేశాడు. కేవలం డైలాగ్స్ మాత్రమే బ్యాలెన్స్. అవే బుర్రా సాయిమాధవ్ రాస్తున్నాడు. త్రిబుల్ ఆర్‌కి మాటల తూటాలు అందించిన తనే ఈ సినిమాకు కూడా మాటలు రాస్తున్నాడు.

Rajamoulis movie in the same backdrop SSMB29
SS RAJAMOULI: రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసే సినిమా తాలూకు ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్ మోస్ట్ పూర్తి కావస్తున్నాయి. ఈ నెల 20 లోగా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తై, వర్క్ షాప్ మొదలవ్వొచ్చట. మహేశ్‌కి మాత్రం వచ్చే వారం నుంచే స్పెషల్ వర్క్ షాపులు ఉంటాయిని తెలుస్తోంది. ఇక ఈ మూవీకి కథని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తే, జక్కన్నే కథనం రాసేశాడు. కేవలం డైలాగ్స్ మాత్రమే బ్యాలెన్స్.
Lokesh Kanagaraj: గ్యాంగ్‌స్టర్‌గా రజినీ.. సినిమా బ్యాక్‌డ్రాప్ మామూలుగా లేదుగా..!
అవే బుర్రా సాయిమాధవ్ రాస్తున్నాడు. త్రిబుల్ ఆర్‌కి మాటల తూటాలు అందించిన తనే ఈ సినిమాకు కూడా మాటలు రాస్తున్నాడు. ఈ వీకెండ్‌లోగా డైలాగ్స్ వర్షన్ పూర్తవుతుందట. దీంతో బౌండెడ్ స్క్రిప్ట్ రెడి అయినట్టే. ఇక మే నుంచి సీన్లను రిహార్సల్స్ చేయటం మొదలు పెడతారని తెలుస్తోంది. అదయ్యాక ఆగస్ట్ 9న లాంచింగ్‌తోపాటు అక్టోబర్ నుంచి షూటింగ్ అని తెలుస్తోంది. ఇలా మహేశ్ బాబు మూవీ పనుల్ని రాజమౌళి వేగంగా పూర్తి చేయిస్తుంటే, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు చరణ్ సినిమావేగం పెంచాడు. మొన్నే లాంచైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.
లాంచింగ్ సమయానికే మూడు పాటల్ని రెడీ చేసిన ఆస్కార్ అచీవర్ ఎఆర్ రెహమాన్, ఇప్పుడు మిగతా మూడు పాటల్నీ రికార్డింగ్ కూడా చేసేశాడట. సినిమా తీయటం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పూర్తి చేయటమే తరువాయి. ప్రీ ప్రొడక్షన్ టైంలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా ప్లాన్ చేస్తూ షాక్ ఇస్తున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు.