SSMB 29: ఉగాదికి మహేశ్ బాబు ఫైనల్ లుక్ రివీల్ చేస్తారా..?
రాజమౌళి సినిమాలో మహేశ్ లుక్ ఏంటనేది ఫైనల్ అయ్యింది. మొత్తం ఎనిమిది లుక్స్ తాలూకు లుక్ టెస్ట్‌లో ఫైనల్ లుక్‌ని ఫిక్స్ చేశారట. ఆ లుక్ కేవలం గ్రాఫిక్స్‌లోనే రెడీ అయ్యింది. అది రియల్‌గా అవ్వాలంటే మహేశ్ జుట్టు భారీగా పెంచాలి.

SSMB29 How far has the Jakkanna-Mahesh story come?
SSMB 29: మహేశ్ బాబుతో రాజమౌళి తీయబోతున్న సినిమా తాలూకు కొత్త అప్‌డేట్స్ రెడీ అవుతున్నాయి. ఉగాది స్పెషల్‌గా సినిమా లాంచింగ్ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కాని ప్రెస్‌మీట్ మాత్రం ఉండేలా ఉంది. ఆ ప్రెస్‌మీటే చివరిదట. ఇక ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మహేశ్ బయట కనిపించడని తెలుస్తోంది. ఇంకో విషయం ఏంటంటే రాజమౌళి సినిమాలో మహేశ్ లుక్ ఏంటనేది ఫైనల్ అయ్యింది.
Kiran Abbavaram: కంగ్రాట్స్ అబ్బవరం.. హీరోయిన్‌తో కిరణ్ అబ్బవరం ఎంగేజ్‌మెంట్..
మొత్తం ఎనిమిది లుక్స్ తాలూకు లుక్ టెస్ట్‌లో ఫైనల్ లుక్‌ని ఫిక్స్ చేశారట. ఆ లుక్ కేవలం గ్రాఫిక్స్‌లోనే రెడీ అయ్యింది. అది రియల్‌గా అవ్వాలంటే మహేశ్ జుట్టు భారీగా పెంచాలి. గెడ్డం, మీసం ఎలాగో పెంచుతున్నాడు. కానీ ఇంకా పొడుగ్గా తన గెడ్డం, జుట్టు ఉండోబోతోంది. పక్కగా లాంగ్ హేయిర్‌తో మహేశ్ కనిపించబోతున్నాడట. కాస్త హాలీవుడ్ మూవీ జాన్ విక్‌లో కీనూ రీవ్స్ లుక్‌ని పోలిన లుక్‌కి, కౌబాయ్ గెటప్ వేస్తే ఎలా ఉంటుందో అలాంటి లుక్ ఉండబోతుందని తెలుస్తోంది.
అంతేకాదు ఈ మూవీలో మహేశ్ బాబు ఆంగ్లో ఇండియన్‌గా కనిపిస్తాడట. ఇండియన్ ఫాదర్, బ్రిటిష్ మదర్‌కి పుట్టిన వ్యక్తిగా సూపర్ స్టార్ కనిపిస్తాడట. ఇలా చాలా విషయాలను ఉగాదిన ప్లాన్ చేసిన ప్రెస్ మీట్‌లో రివీల్ చేసేందుకు రాజమౌళి టీం రెడీ అయ్యింది.