SS RAJAMOULI: మహేశ్ బాబుకు రాజమౌళి కండిషన్.. మే నుంచి బయట కనిపించడా..?

మహేశ్ పూర్తి లుక్ ఎలా ఉంటుందో మాత్రం సినిమా గ్లింప్స్ వచ్చే వరకు రివీల్ చేసే ఛాన్స్ లేదు. అందుకే మీడియా కంట పడకుండా, దేశాలు దాటేప్పుడు మీడియా ఫోకస్‌లో పడకుండా, చార్టర్డ్ ఫ్లైట్‌తోపాటు చాలా జాగ్రత్తలు ప్రిపేర్ చేశాడట రాజమౌళి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2024 | 05:38 PMLast Updated on: Feb 22, 2024 | 5:38 PM

Ss Rajamouli And Mahesh Babu Movie Mahesh Will Not Come To Public Untill Movie Complete

SS RAJAMOULI: రాజమౌళితో సినిమా అంటేనే ఆ హీరో కొంతకాలంపాటు ఇక జనాల మధ్య కనిపించడు. పూర్తిగా సెట్‌కే అంకితమౌతాడు. అలానే మహేశ్ బాబు కూడా రెండేళ్లవరకు రాజమౌళి సినిమా వల్ల, ఫ్యాన్స్‌కి, మీడియాకి దూరంగా ఉంటాడా అంటే, అందులో సగం నిజం ఉంది. అదే జక్కన్న కండిషన్. కేవలం షూటింగ్ వల్ల మహేశ్ జనాలకి దూరంగా ఉండటం కాదు, అసలు కనీసం కనిపించే పరిస్థితి కూడా ఉండదట.

TRISHA: చిరంజీవి తర్వాత వెంకీ, నాగ్, బాలయ్యతో జోడీ కన్ఫామ్

కారణం తన లుక్ ఎక్కడ రివీల్ అవుతుందో అని. అంటే ఈ లెక్కన ఈమధ్య తను గడ్డం, మీసంతో కనిపించిన లుక్ ఫైనల్ కాదా అంటే.. కానేకాదు. కనీసం రెండు ఇంచుల వరకు పొడుగ్గా గడ్డం ఉండటం, నులితిప్పిన మీసకట్టుని ప్లాన్ చేశాడట రాజమౌళి. అంతేకాదు.. మహేశ్ పూర్తి లుక్ ఎలా ఉంటుందో మాత్రం సినిమా గ్లింప్స్ వచ్చే వరకు రివీల్ చేసే ఛాన్స్ లేదు. అందుకే మీడియా కంట పడకుండా, దేశాలు దాటేప్పుడు మీడియా ఫోకస్‌లో పడకుండా, చార్టర్డ్ ఫ్లైట్‌తోపాటు చాలా జాగ్రత్తలు ప్రిపేర్ చేశాడట రాజమౌళి.

ఇక 40 శాతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ప్లాన్ చేయటానికి కారణం కూడా మహేశ్ లుక్ రివీల్ కాకుండా రెండేళ్లు జాగ్రత్త పడటంలో భాగమే అని తెలుస్తోంది. ఇంతగా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాడంటే, ఈపాన్ వరల్డ్ మూవీకోసం మహేశ్‌ని హాలీవు్డ్ హీరోని తలతన్నేలా తయారు చేస్తున్నాడనేమో అన్న అంచనాలు, హైప్ పెరిగిపోతోంది.