SSMB 29: రాజమౌళి-మహేశ్ సినిమా.. అప్పటిదాకా ఆలస్యమే..
ఏప్రిల్‌లో లాంచింగ్ మాత్రమే కాదు.. ఎనౌన్స్‌మెంట్ కూడా ఉండే ఛాన్స్ లేదని తేలిపోయింది. ఈ సినిమాని ఎనౌన్స్ చేయాలంటే, హీరో ఒక్కడి పాత్ర ఓకే అయితే సరిపోదు. ఆల్రెడీ మహేశ్‌తో తన సినిమా అని తేల్చాడు కాబట్టి మహేశ్ బాబుతో తన మూవీ అంటూ ఎనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు.

It seems that Rajamouli's movie ssmb29 with Mahesh Babu will be announced on April 9 Ugadi.
SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా ఏప్రిల్‌లో లాంచ్ అవుతుందన్నారు. కనీసం ఎనౌన్స్‌మెంట్ వచ్చినా చాలని ఫ్యాన్స్ ఆసక్తిగా వేయిట్ చేస్తున్నారు. కాని, ఏప్రిల్‌లో లాంచింగ్ మాత్రమే కాదు.. ఎనౌన్స్‌మెంట్ కూడా ఉండే ఛాన్స్ లేదని తేలిపోయింది. ఈ సినిమాని ఎనౌన్స్ చేయాలంటే, హీరో ఒక్కడి పాత్ర ఓకే అయితే సరిపోదు. ఆల్రెడీ మహేశ్‌తో తన సినిమా అని తేల్చాడు కాబట్టి మహేశ్ బాబుతో తన మూవీ అంటూ ఎనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు.
Donald Trump: సంపదలో దూసుకెళ్లిన ట్రంప్.. ఎన్నివేల కోట్లు పెరిగిందంటే..
ఒకవేళ కొత్తగా ఎనౌన్స్ చేయాలంటే విలన్, హీరోయిన్ పాత్రలకు కూడా ఎవరినో ఒకరిని ఫిక్స్ చేసి, అప్పుడు పోస్టర్ రూపంలోనో.. మరోలానో సినిమాను ఎనౌన్స్ చేసినా అర్ధం ఉంటుంది. ఆ కారణంగానే ఏప్రిల్ 9న ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ ఆలోచనని పక్కన పెట్టాడు రాజమౌళి. అలియా భట్ హీరోయిన్ అంటున్నారు. కాని అది నిజం కాదట. ఇండోనేషియా లేడీ చెల్సియా ప్రచారం కూడా ఉత్తదే అంటున్నారు. ఎటొచ్చి విలన్‌గా హృతిక్ రోషన్ ఓకే చేస్తే అప్పుడు హీరో, విలన్ల పాత్రల ఫోటోలు పెట్టి ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయాలనుకుంటున్నాడట రాజమౌళి. హృతిక్‌కి రాజమౌళి ఆఫర్ నచ్చినా, తను వార్ 2 తోపాటు, క్రిష్ 4కి కమిటయ్యాడు. సో తన డేట్లు చూసుకునే కాల్‌షీట్స్ ఇవ్వాలి.
అది తేలేందుకు టైం పడుతుందని, తనకి కూడా కొన్ని క్లారిటీలు రావాలని అన్నాడట. అదంతా ఏప్రిల్ 9 లోగా కాదు కాబట్టే, మరో మంచి అకేషన్ చూసుకుని.. అంటే మహేశ్ బాబు బర్త్ డే అయిన ఆగస్ట్ 9కి ఎనౌన్స్‌మెంట్ ఉంటుందట. మోషన్ పోస్టర్‌తో టైటిల్‌ని కూడా ఎనౌన్స్ చేస్తూ సినిమాను అప్పుడు లాంచ్ చేస్తారని తెలుస్తోంది.