SS RAJAMOULI: మహేశ్-రాజమౌళి సినిమా పనులు మొదలు.. ఎప్పటినుంచంటే!

అసలు ప్రి ప్రొడక్షన్ అంటే హీరోకి జోడీ ఎవరు, టెక్నీషియన్స్ ఎవరనేది తేల్చటం. వాళ్ల డేట్లు, షూటింగ్ స్లాట్లు డిసైడ్ చేయటం. ఇదంతా దసరా తర్వాత మొదలు కానుంది. సో.. ఈనెల 24 తర్వాత మహేశ్ మూవీ తాలూకు ప్రి ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 11, 2023 | 06:53 PMLast Updated on: Oct 11, 2023 | 6:53 PM

Ss Rajamouli And Mahesh Babu Movie Pre Production Work Will Start After Dussehra

SS RAJAMOULI: సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం షూటింగ్ డిసెంబర్ 18లోగా పూర్తిచేయాలని డెడ్‌లైన్ పెట్టుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ తర్వాత 20 రోజుల పాటు మహేశ్ వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు. ఆ తర్వాతే రాజమౌళి మేకింగ్‌లో మూవీ అన్నారు. కాని అంతకుముందే జక్కన్న ఏదో సందడి మొదలు పెట్టేలా ఉన్నాడు. ఆల్రెడీ మహేశ్ బాబు మూవీ కథ సిద్దమైందని కొత్తగా సమాచారం అందుతోంది. సో.. ప్రి ప్రొడక్షన్ పనుల్లో అతిముఖ్యమైన ఘట్టం కథ సిద్దం చేయటం అయిపోయింది.

ఇక అసలు ప్రి ప్రొడక్షన్ అంటే హీరోకి జోడీ ఎవరు, టెక్నీషియన్స్ ఎవరనేది తేల్చటం. వాళ్ల డేట్లు, షూటింగ్ స్లాట్లు డిసైడ్ చేయటం. ఇదంతా దసరా తర్వాత మొదలు కానుంది. సో.. ఈనెల 24 తర్వాత మహేశ్ మూవీ తాలూకు ప్రి ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి. డిసెంబర్ వరకు స్టార్ కాస్ట్, క్రూ తోపాటు లొకేషన్ హంట్ జరుగుతుంది. ఆలోగా మహేశ్ గుంటూరు కారం షూటింగ్ పూర్తవుతుంది. జనవరి నుంచి మార్చ్ ఎండ్ వరకు సూపర్ స్టార్ తన ఫిజిక్ మార్చుకునేందుకు కెనడాలో వర్కవుట్ ట్రైనింగ్ పూర్తిచేయాల్సి ఉంటుంది. సో.. ఎలా చూసినా ఏప్రిల్ వరకు రాజమౌళి, మహేశ్.. రకరకాల కారణాలతో ప్రాజెక్ట్ పనుల్లోనే ఉంటారు. కాని వర్క్ షాపులు, షూటింగ్స్ మాత్రం మొదలు కావు. ఏప్రిల్‌లో వర్క్ షాపు అంటే.. నటీ నటుల మధ్య కో ఆర్డినేషన్, కథేంటి, పాత్రలెలా ఉంటాయి.. ఏంచేయాలి.. అనే డిస్కర్షన్ ఉంటుంది.

ఇవన్నీ జులైలోగా పూర్తి చేసి, ఆగస్ట్‌లో షూటింగ్‌కి వెళతారట. సో.. గతంలో చెప్పినట్టు, ఏప్రిల్‌లో లాంచింగ్, ఆగస్ట్‌లో షూటింగ్ అన్నది నిజమే. అలాగని అంతకాలం రాజమౌళి, మహేశ్ ఖాళీగా ఉంటారా అంటే అదీ లేదు. సో.. షూటింగ్ ఎప్పుడనే విషయం పక్కన పెడితే, ఈ ప్రాజెక్ట్ పనులు మాత్రం ఈనెల 24 తర్వాత నుంచే మొదలవ్వటం ఫైనలైంది.