SS RAJAMOULI: జక్కన్న కోసం మహేశ్ త్యాగం.. ఏకంగా అన్నేళ్లు ఒక్క సినిమా కోసమే..?

రాజమౌళి కోసం ఏళ్లకి ఏళ్లు కాల్ షీట్స్ వదులుకున్నా, కెరీర్‌కి నష్టం లేదనే అభిప్రాయం దేశవ్యాప్తంగా హీరోల్లో ఉంది. రాజమౌళి కూడా తనకు బెండ్ అయ్యే హీరోలతోనే పనిచేస్తాడనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే తన మేకింగ్‌లో సినిమాలు తీస్తే హీరోల తలరాతలు మారిపోతాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 20, 2024 | 08:16 PMLast Updated on: Jan 20, 2024 | 8:17 PM

Ss Rajamouli And Mahesh Babu Movie Will Be Released In 2027 Dusshera

SS RAJAMOULI: రాజమౌళి అంటేనే దర్శకధీరుడు. ఎంతటి హీరో అయినా తను చెప్పింది వినాల్సిందే. ఎందుకంటే తన మేకింగ్‌లో సినిమాలు తీస్తే హీరోల తలరాతలు మారిపోతాయి. పాన్ ఇండియా మార్కెట్లు, గ్లోబల్ స్టార్‌గా ఫేం లాంటివి వచ్చేస్తాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటివాళ్లే మూడేళ్లు అన్నీ పక్కన పెట్టి రాజమౌళికే తమ టైం కేటాయించారు.

Vijay Devarkonda: ప్రభాస్ మూవీలో రౌడీ హీరో.. విజ‌య్‌ దేవ‌ర‌కొండ జాక్‌పాట్..!

గ్లోబల్ స్టార్స్‌గా మారారు. ప్రభాస్ కూడా బాహబలి కోసం 4 ఏళ్లు బలి చేసుకున్నాడు. ఫలితంగా పాన్ ఇండియా సూపర్ హీరో అయ్యాడు. కాబట్టి.. రాజమౌళి కోసం ఏళ్లకి ఏళ్లు కాల్ షీట్స్ వదులుకున్నా, కెరీర్‌కి నష్టం లేదనే అభిప్రాయం దేశవ్యాప్తంగా హీరోల్లో ఉంది. రాజమౌళి కూడా తనకు బెండ్ అయ్యే హీరోలతోనే పనిచేస్తాడనే అభిప్రాయం ఉంది. మొత్తానికి రెండేళ్లు షూటింగ్‌కి, 6 నెలలు వర్క్ షాపులకి, మరో ఆరునెలలు ప్రమోషన్‌కి అంటూ 3 ఏళ్లు రాజమౌళికే అర్పించేస్తున్నాడు మహేశ్ బాబు.

తనలాంటి సూపర్ స్టార్ కూడా రాజమౌళి కోసం ఇలా డేట్లు.. స్వీట్లు పంచినట్టు పంచటం హాట్ టాపిక్ అవుతోంది. 2026లో ఈ సినిమా రిలీజ్ అంటున్నారు. కాని, జక్కన్న లెక్కల ప్రకారం చూస్తే 2027 దసరాకే ఈ సినిమా రిలీజ్ అయ్యేలా ఉంది.