SS RAJAMOULI: ఐదు వేల కోట్ల టార్గెట్.. మహేశ్ మూవీ విషయంలో రాజమౌళి భారీ ప్లానింగ్.. ?

ఈగతో అప్పట్లో రూ.150 కోట్లు, బాహుబలి 1 తో 600 కోట్లు, బాహుబలి 2 తో 2200 కోట్లు రాబట్టాడు రాజమౌళి. త్రిబుల్ ఆర్‌తో 1250 కోట్ల కలెక్షన్లతోపాటు గ్లోబల్‌గా మాత్రం పేరు తెచ్చింది. ఒక ఆస్కార్ కూడా వచ్చింది. ఎంత చేసినా మన స్థామినా 2 వేల కోట్లే తప్ప, 3 వేల కోట్ల రేంజ్ వస్తే అదో రికార్డ్ అంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 13, 2024 | 08:23 PMLast Updated on: Apr 13, 2024 | 8:23 PM

Ss Rajamouli And Mahesh Babu Movie Will Collect Rs 5000 Crores Is It True

SS RAJAMOULI: 5 వేల కోట్లు, పది వేల కోట్లు, 20, 30, 40 వేల కోట్లు.. ఇది హాలీవుడ్ సినిమాల స్టామినా. అందుకే అక్కడ హీరోలకి, హీరోయిన్లకి 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఉంటుంది. మరి మన ఇండియన్ సినిమాకు ఆ రేంజ్ రాదా అంటే..? మరీ పదివేల కోట్ల సీన్ ఇప్పుడే రాకున్నా, 5 వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టే సినిమాల సీన్ ఇప్పుడు వచ్చేలా ఉంది. అది కూడా ఇండియన్ జేమ్స్ కామెరున్ రాజమౌళి కొత్త ప్రాజెక్ట్‌కే సాధ్యమయ్యేలా ఉంది.

Mohammed Siraj: సిరాజ్‌కు ఏమైంది.. భారీగా రన్స్ ఇచ్చేస్తున్న పేసర్..

ఈగతో అప్పట్లో రూ.150 కోట్లు, బాహుబలి 1 తో 600 కోట్లు, బాహుబలి 2 తో 2200 కోట్లు రాబట్టాడు రాజమౌళి. త్రిబుల్ ఆర్‌తో 1250 కోట్ల కలెక్షన్లతోపాటు గ్లోబల్‌గా మాత్రం పేరు తెచ్చింది. ఒక ఆస్కార్ కూడా వచ్చింది. ఎంత చేసినా మన స్థామినా 2 వేల కోట్లే తప్ప, 3 వేల కోట్ల రేంజ్ వస్తే అదో రికార్డ్ అంటారు. కాని ఈ సారి 5 వేల కోట్ల ఛాన్స్ ఉంది. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీసే సినిమాకు 5 వేల కోట్లు రాబట్టే స్టామినా ఉంది. ఆల్రెడీ హాలీవుడ్ సంస్థలైన డ్రీమ్ వర్క్స్, సోనీ ఈ రెండు రంగంలోకి దిగుతున్నాయి. మహేశ్ బాబుతో రాజమౌళి తీసే సినిమాకు యూఎస్, యూరప్ డిస్ట్రిబ్యూషన్ ఈ సంస్థలు చూసుకుంటుంటే, ఓటీటీ విషయంలో నెట్‌ఫ్లిక్స్ రంగంలోకి దిగుతోంది. ఆస్కార్ లాబీలో నెట్‌ఫ్లిక్స్ సంస్థకి మంచి గ్రిప్ ఉంది. కనకే, త్రిబుల్ ఆర్ సాంగ్ ఆస్కార్ అచీవ్‌మెంట్ విషయంలో రావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. కాబట్టి.. ఈ దిగ్గజ కంపెనీలు ఓ మూవీని వరల్డ్ వైడ్‌గా విడుదల చేస్తే ఆ ప్రమోషన్ స్థాయే వేరు.

అలాగే రాజమౌళి కూడా 500 కోట్ల ప్రాజెక్ట్ ని 1500 కోట్ల బడ్జెట్‌కి మార్చాడని తెలుస్తోంది. అంటే పెట్టుబడే రూ.1500 కోట్లకు చేరితే, రాబడి డబుల్ అయినా 3 వేల కోట్లు, ఇంకాస్త ఎక్కువే వస్తే 5 వేల కోట్లు పెద్ద విషయం కాదు. ఆ మైలు రాయి కూడా రాజమౌళితో మహేశ్ చేసే సినిమానే దాటేలా ఉంది. హాలీవుడ్ సంస్థల పెట్టుబడి వల్ల ఈ మూవీ బడ్జెట్‌ పాటు రీచ్ కూడా పెరగబోతోంది. ఇదే జరిగితే ఇక బాలీవుడ్ కేవలం టాలీవుడ్‌ని చూస్తూ సైలెంట్ అవటం తప్ప మరో ఛాన్స్ లేదు.