SSMB 29: సూపర్ స్టార్‌కి ట్యూషన్.. షూటింగ్ ఇంత ఆలస్యమా..?
ఏప్రిల్ 14 నుంచి మే 25 వరకు సూపర్ స్టార్ మహేశ్ బాబుకి స్పెషల్ ట్యూషన్ ఉండబోతోందట. 5 యాక్షన్ సీన్లు, 8 ఇంటెన్సిటీ ఉన్న సీన్ల రిహార్సల్స్‌ని ప్లాన్ చేశాడట రాజమౌళి. గ్రీన్ మ్యాట్ సెట్లో ఆ పనులు మొదలౌతున్నాయి.

SSMB29 How far has the Jakkanna-Mahesh story come?
SSMB 29: రాజమౌళి మేకింగ్‌లో మహేశ్ బాబు చేయబోయే సినిమా మహారాజా అని ప్రచారం జరిగింది. ఐతే అది కేవలం ఫిల్మ్ టీం చర్చల్లోకి వచ్చిన పేరు మాత్రమే అని, ప్రస్తుతానికి రాజమౌళి ఈ సినిమా హీరో పేరుని మహరాజా అన్న పేరుతోనే సంభోదించటంతో టైటిల్ అదేఅని అనుకున్నారు. అఫీషియల్‌గా టైటిల్ ఇంకా తేలకున్నా.. ఏప్రిల్ 14 నుంచి మే 25 వరకు సూపర్ స్టార్ మహేశ్ బాబుకి స్పెషల్ ట్యూషన్ ఉండబోతోందట. 5 యాక్షన్ సీన్లు, 8 ఇంటెన్సిటీ ఉన్న సీన్ల రిహార్సల్స్‌ని ప్లాన్ చేశాడట రాజమౌళి.
Indian 2: కల్కి అవతారానికి.. ఇండియన్ భయపడ్డాడా..?
గ్రీన్ మ్యాట్ సెట్లో ఆ పనులు మొదలౌతున్నాయి. కేవలం రిహార్సల్స్‌కే ఇంత పగడ్బంధీగా ప్లాన్ చేసిన రాజమౌళి.. షూటింగ్ ఇంకెలా ప్లాన్ చేస్తాడో చెప్పక్కర్లేదు. ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఎలిజబెత్‌ని నిజంగానే హీరోయిన్‌గా తీసుకుంది ఫిల్మ్ టీం. తన పోస్టర్ ని మే 9న లాంచ్ చేయబోతున్నారు. తను జూన్ నుంచి ఫిల్మ్ టీం వర్క్ షాపుల్లో జాయిన్ అవుతుందట. ఆల్రెడీ కీరవాణితో మ్యూజిక్ సిట్టింగ్స్ నడుస్తున్నాయి మార్చ్ ఎండ్‌లోగా లొకేషన్లు ఫైనలైజ్ అవటంతోపాటు సినిమాటోగ్రాఫర్, గ్రాఫిక్స్ సూపర్ వైజర్‌కి ఇవ్వాల్సిన ఇన్‌పుట్స్ ఇచ్చే కార్యక్రమం పూర్తౌతుంది. ఏప్రిల్ 9కి అనుకున్న సినిమా లాంచ్ ఆగస్ట్ 9కి వాయిదా పడిందన్న వార్త నిజమని తెలుస్తోంది.
అప్పుడే జేమ్స్ కామేరున్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూడా ఈ లాంచింగ్ వేడుకకు రాబోతున్నారు. స్పీల్‌బర్గ్ సంస్థ డ్రీమ్ వర్క్స్ ఈ సినిమా ప్రొడక్షన్‌లో జాయిన్ కాబోతోంది. ఇక ఈ ఏడాది ఎండింగ్‌కి షూటింగ్ అన్నారు. కానీ, 2025 జనవరి 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతోందట. అప్పటి వరకు ఇలా రిహార్సల్స్ మాత్రమే ఉంటాయి. మహేశ్ బాడీ లుక్ కూడా మార్చాలి. కాబట్టే తనకు 4 నెలలు ఎక్స్ ట్రా టైం ఇచ్చారట.