SS RAJAMOULI: నెక్ట్స్ ఏంటి..? రాజమౌళిలానే భయపడుతున్నారు
ఒక స్థాయి దాటాక హీరోలైనా, దర్శకులైనా మామూలు మూవీలు తీయటం కుదరదు. ఈగకి ముందు వరకు మాస్ హీరోయిజం చూపించిన జక్కన్న కొత్తగా ఏం చేయాలంటే ఈగ ఐడియా వచ్చింది. తర్వాత బాహుబలితో పురాణాలు, చరిత్రలు తవ్వాల్సి వచ్చింది.
SS RAJAMOULI: రాజమౌళి ఇప్పుడు మహేశ్ బాబుతో ఆఫ్రికా అడవుల్లో అద్బుతాలు, సాహసాలంటున్నాడు. స్క్రిప్ట్ రెడీ. కానీ, ప్రీ ప్రొడక్షన్ పనులు, స్టార్ కాస్ట్ సెలక్షన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నాడు. త్రిబుల్ ఆర్ వచ్చి రెండేళ్లవుతోంది. ఇంకా జక్కన్న కొత్త సినిమా షూటింగ్ షురూ కాలేదు. ఈ ఆలస్యం అంతా పక్ఫెక్షన్ కోసమే అనుకుంటే కాదు. అక్కడే ట్విస్ట్ ఉంది. ఒక స్థాయి దాటాక హీరోలైనా, దర్శకులైనా మామూలు మూవీలు తీయటం కుదరదు.
HYPER ADI: పవన్ కోసం హైపర్ ఆది.. ఏం చేయబోతున్నాడో తెలుసా..
ఈగకి ముందు వరకు మాస్ హీరోయిజం చూపించిన జక్కన్న కొత్తగా ఏం చేయాలంటే ఈగ ఐడియా వచ్చింది. తర్వాత బాహుబలితో పురాణాలు, చరిత్రలు తవ్వాల్సి వచ్చింది. ఈ రెంజ్ సినిమా తీసి సునామీ క్రియేట్ చేసిన తర్వాత తెలంగాణ యోధుడు కొమరం భీమ్, పోరాట వీరుడు అల్లూరినీ కలిపి ఫిక్షన్ స్టోరీతో దేశభక్తిని రగిలించాడు. అప్పుడే రాజమౌళి కథల కొరత కొట్టొచ్చినట్టు కనిపించిందంన్నారు. ఇప్పుడు దేశం విడిచి విదేశీ అద్భుతాలు, సాహసాలతో ఇండియన్ హీరోయిజం చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా సినిమా సినిమాకు, ఇమేజ్ పెరుగుతుండటంతో నెక్ట్స్ ఏంటనే ప్రశ్న రాజమౌళిని వణికించేలా ఉంది. కనీసం రాజమౌళి మూడు నాలుగు పాన్ ఇండియా హిట్లు తీశాక నెక్ట్స్ కొత్తగా ఏం తీయాలనే ప్రశ్న భయపెట్టొచ్చు.
కాని కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 2 తర్వాత ఏం తీయాలో తెలీక.. తన పాత మూవీ ఉగ్రం రీమేక్ సలార్‌తో గట్టెక్కాడు. సలార్ 2 ఉంది కాబట్టి ఈసారికి ఎలాగోలా గట్టెక్కే ఛాన్స్ ఉంది. కాని అది కూడా వెయ్యికోట్ల మూవీ అయితే, ఆ తర్వాత ఏం సినిమా తీయాలనే ప్రశ్న తనని వేధించే ఛాన్స్ ఉంది. పుష్ప 2 తర్వాత చరణ్‌తో మూవీ ప్లాన్ చేసిన సుకుమార్‌ది కూడా ఇదే దుస్థితి.