MAHESH BABU: కండీషన్స్‌తో మహేశ్‌కు చుక్కలు చూపిస్తున్న రాజమౌళి..!

రాజమౌళి సినిమాలో పర్ఫెక్షన్ కోసం హీరోలను ఎంత కష్టపెడతాడో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో రామ్ చరణ్, తారక్ తమను చాలా టార్చర్ పెట్టినట్లు కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మహేశ్ బాబు వంతు వచ్చినట్లు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 28, 2023 | 02:26 PMLast Updated on: Nov 28, 2023 | 2:26 PM

Ss Rajamouli Ordered To Mahesh Babu About Perfect Diet

MAHESH BABU: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబీ 29 మూవీపై ఇప్పటి నుంచే భారీ స్థాయిలో అంచనాలున్నాయి. మహేశ్‌ బాబు ఇమేజ్‌ గురించి.. దర్శక దిగ్గజం రాజమౌళి టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకపోవడంతో.. ఈ మూవీపై ఇప్పటి నుంచే ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ సినిమా కోసం ఇప్పటినుంచే మహేశ్‌కు రాజమౌళి టార్చర్ మొదలైందంటూ టాలీవుడ్‌లో ఓ సరదా టాక్ నడుస్తోంది.

ASSEMBLY ELECTIONS: తెలంగాణ ఎన్నికలపై దేశమంతా కాయ్ రాజా కాయ్.. భారీ బెట్టింగ్..!

రాజమౌళి సినిమాలో పర్ఫెక్షన్ కోసం హీరోలను ఎంత కష్టపెడతాడో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో రామ్ చరణ్, తారక్ తమను చాలా టార్చర్ పెట్టినట్లు కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మహేశ్ బాబు వంతు వచ్చినట్లు తెలుస్తోంది. ఎస్ఎస్ఎంబీ 29కి ఇంకా స్టోరీ వర్క్ నడుస్తోంది. ఎప్పుడో మొదలు పెట్టాల్సిన ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే మహేశ్ బాబుకు జక్కన్న కండిషన్స్ పెడుతున్నాడంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తన సినిమాల్లో హీరోల లుక్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండే జక్కన్న.. మహేశ్ బాబు ఒక డైట్ ఫాలో అయ్యే విధంగా న్యూట్రిషియన్‌ను అపాయింట్ చేశాడని టాక్. అయితే, సినిమాలే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా పర్ఫెక్ట్‌గా డైట్ మెయింటేన్ చేసే మహేశ్ బాబు పెద్దగా ఇబ్బంది పడలేదట. కానీ, ఇప్పుడు రోజుకి 8 గంటలు జిమ్ చేస్తూ ప్రత్యేక డైట్ కూడా ఫాలో అవ్వాల్సి వస్తోందని ఇన్‌సైడ్ టాక్. గుంటూరు కారం సినిమా చిత్రీకరణను పూర్తి చేసే పనిలో ఉన్న మహేశ్ బాబుకు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారుతోందట.

రెగ్యులర్‌గా జిమ్, డైట్ విషయంలో ఇబ్బంది పడని మహేశ్ బాబుకు గుంటూరు కారం షూటింగ్, ఎస్ఎస్ఎంబీ 29 కోసం జిమ్, డైట్ రెండింటిని హ్యాండిల్ చేయడం కాస్తా కఠినంగా అనిపిస్తోందని మూవీ సర్కిల్‌లో ఓ టాక్ నడుస్తోంది. అయితే.. ఏది ఏమైనా కానీ, డైట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందేనని మహేశ్ బాబుకు జక్కన్న సంకేతాలు పంపిస్తున్నాడట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ టాపిక్ మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది. మొత్తానికి మిస్టర్ పర్‌ఫెక్ట్ జక్కన్న.. ప్రిన్స్ మహేశ్‌కు ఇప్పటి నుంచి టార్చర్ చూపిస్తున్నాడంటూ సినీ జనాలు కామెంట్లు చేస్తున్నారు.