SSMB 29: మహేశ్ సినిమా డీటైల్స్ చెప్పేస్తానంటున్న రాజమౌళి..
సినిమా లాంచ్ చేసి, అదేరోజు ప్రెస్ మీట్ పెట్టి, కథేంటి, ఎలా ఉండబోతోందో కొన్ని వివరాలు ఇవ్వటం రాజమౌళి స్టైల్. ఈ సారి అందుకు భిన్నంగా సినిమా లాంచింగ్ కంటే ముందే, ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నాడు.

It seems that Rajamouli's movie ssmb29 with Mahesh Babu will be announced on April 9 Ugadi.
SSMB 29: రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు చేయబోయే పాన్ వరల్డ్ మూవీ తాలూకు ప్రెస్ మీట్ కన్ఫామ్ అయ్యింది. ఏప్రిల్ 9 లేదా ఆగస్ట్ 9కి ప్రెస్ మీట్ అంటూ గత రెండు వారాలుగా గుసగుసలొస్తున్నాయి. ఇలా సినిమా లాంచింగ్ రోజు ప్రెస్ మీట్ పెట్టడం కాదుకాని, మే నెలలో ఓ ప్రెస్ మీట్ పెట్టి రూమర్స్ చెక్ పెట్టాలనుకుంటున్నాడట దర్శకధీరుడు. సినిమా లాంచ్ చేసి, అదేరోజు ప్రెస్ మీట్ పెట్టి, కథేంటి, ఎలా ఉండబోతోందో కొన్ని వివరాలు ఇవ్వటం రాజమౌళి స్టైల్.
KALKI 2898 AD: కల్కి వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..
ఈ సారి అందుకు భిన్నంగా సినిమా లాంచింగ్ కంటే ముందే, ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నాడు. అసలే హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి ప్లాన్ చేస్తున్న సినిమా అవటంతో, మొత్తం ప్లానింగ్‌కే టైం పడుతోంది. ప్రి ప్రొడక్షన్ పనులకే ఎక్కువ టైం పట్టేలా ఉంది. సో.. లాంచింగ్ రోజే ప్రెస్ మీట్ పెట్టి రూమర్స్‌కి బ్రేక్ వేయాలంటే కుదరదు. అందుకే మే నెలలో ఓ ప్రెస్ మీట్ పెట్టి మహేశ్‌తో తన సినిమాని ఎనౌన్స్ చేసి, హీరోతో పాటు కొంత మంది క్రూ మెంబర్స్ లిస్ట్ ఎనౌన్స్ చేయబోతున్నాడు రాజమౌళి.
అలా చేస్తే అనవసరపు రూమర్స్‌కి చెక్ పెట్టొచ్చనేది తన అభిప్రాయం అని తెలుస్తోంది. మొత్తానికి ఇలా అయినా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌కి ఈ ప్రాజెక్ట్ తాలూకు అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.