SS RAJAMOULI: రాజమౌళి టాక్స్ ఎగ్గొడుతున్నాడా..? లెక్కలు తేల్చారా..?

వందలకోట్ల వసూళ్లు రాబట్టే సినిమాలు తీశాడు కాబట్టి, వేల కోట్లు వెనకేసుకునే చాన్స్ ఉంది. అంటే వందకోట్లలోపు వసూళ్లు రాబట్టిన సినిమాలు తీసినవాళ్లే వేల కోట్ల ఆస్తులు పోగేసుకుంటున్నారు. వచ్చిన డబ్బుతో స్థలాలు, పొలాలు కొని ఎక్కడికో వెళ్లిపోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 2, 2024 | 05:27 PMLast Updated on: Apr 02, 2024 | 5:27 PM

Ss Rajamoulis Assets And Propertys Details Are Here

SS RAJAMOULI: దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లోనే ఈగ, బాహుబలి రెండు భాగాలు, త్రిబుల్ ఆర్ వచ్చాయి. వందకోట్లు, 500 కోట్లు, 1200 కోట్లు, 1800 కోట్లు ఇవి తన సినమాల వసూళ్ల రికార్డులు. ఇప్పుడు మహేశ్ బాబుతో తీయబోయే సినిమా బడ్జెట్టే రూ.1500 కోట్లు. మరి ఇంత మార్కెట్, ఇంత స్టామినా ఉన్న రాజమౌళి ఇప్పటి వరకు ఎన్ని వందలకోట్లు సంపాదించాడో తెలుసా..? టాక్స్ ఎంత కడుతున్నాడో తెలుసా..? ఇవన్నీ లెక్కలు వింటే కళ్లు బైర్లు కమ్మాలి.

Allu Arjun: లోడింగ్.. పుష్ప ది రూల్‌ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్.. అందరిలో ఆసక్తి

వందలకోట్ల వసూళ్లు రాబట్టే సినిమాలు తీశాడు కాబట్టి, వేల కోట్లు వెనకేసుకునే చాన్స్ ఉంది. అంటే వందకోట్లలోపు వసూళ్లు రాబట్టిన సినిమాలు తీసినవాళ్లే వేల కోట్ల ఆస్తులు పోగేసుకుంటున్నారు. వచ్చిన డబ్బుతో స్థలాలు, పొలాలు కొని ఎక్కడికో వెళ్లిపోయారు. దీని ప్రకారం.. రాజమౌళి మొత్తం ఆస్తి విలువ సుమారు 160 కోట్లు. తన ఇల్లే 50 కోట్లుంటుందట. ఇక ఫామ్ హౌజ్, పొలాలు స్థలాలు, బెంగుళూరు, ముంబై ప్రాపర్టీస్ ఇలా అన్నీ కలుపుకుని వంద కోట్ల వరకుంటాయి. మిగతా పదికోట్లు తన లగ్జరీ కార్ల విలువ. అంటే గట్టిగా చెప్పలంటే బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి మూవీలతో వెయ్యికోట్లు, 1800 కోట్లు రాబట్టిన తను, మరీ ఈగ వసూళ్లంత.. అంటే 120 నుంచి 160 కోట్ల లోపే ఆస్తులు పోగేసుకున్నాడంటే షాకింగ్‌గా ఉంది. తను బాహుబలి టైంలో 30 కోట్లు, త్రిబుల్ ఆర్‌కి వచ్చిన రెమ్యునరేషన్‌లో 40 కోట్లు ట్యాక్స్ కట్టాడట.

ఎలా చూసుకున్నా రాజమౌళి సినిమా ప్యాషన్‌తో ఫోకస్ అంతా ఫైనల్ ఔట్‌పుట్ మీదే చూపిస్తున్నాడు కాని, పూర్తిగా డబ్బులు, ఆస్తులు పోగేసుకునే బాపతు కాదని తేలిపోతోంది. అలాగని డబ్బు వదులుకోవట్లేదు. కాని తన స్థానంలో ఎవరున్నా కనీసం వెయ్యి లేదంటే రెండు వేల కోట్ల ఆస్తులు పోగేసుకునే ఛాన్స్ఉంది. సంపాదించిన ఎమౌంట్ చాలా మంది స్థలాలు రియల్ ఎస్టేట్ మీద పెడితే, అటు వైపు కేటాయించేందుకు టైం లేక, వచ్చిన డబ్బుని ఇల్లు, ఫామ్ హౌజ్, కొన్ని స్థలాలు, ప్రాపర్టీస్‌తో సరిపెట్టుకుంటున్నాడు జక్కన్న. ఇట్స్ రియల్లీ గ్రేట్.