kannappa: మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌లోకి మరొకరు.. కన్నప్ప కోసం ప్రభుదేవా

ఈ సినిమాలో పలువురు స్టార్లు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. వారిలో ప్రభాస్, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి బిగ్ స్టార్స్ ఉన్నారు. నందమూరి బాలకృష్ణ కూడా ఈ లిస్టులో చేరే అవకాశముందని న్యూస్ వినిపించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 4, 2024 | 02:40 PMLast Updated on: Mar 04, 2024 | 2:40 PM

Star Choreographer Prabhu Deva Joins The Sets Of Manchu Vishnus Kannappa

kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ‘కన్నప్ప’ చిత్రం తరచూ వార్తల్లో నిలుస్తోంది. మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఎందరో ప్రముఖ నటీనటులను, టెక్నీషియన్లను రంగంలోకి దింపుతున్నారు. ఈ సినిమాలో పలువురు స్టార్లు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. వారిలో ప్రభాస్, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి బిగ్ స్టార్స్ ఉన్నారు. నందమూరి బాలకృష్ణ కూడా ఈ లిస్టులో చేరే అవకాశముందని న్యూస్ వినిపించింది.

Rajinikanth: రియల్ హీరో.. పేదల కోసం ఆసుపత్రి నిర్మాణం.. దటీజ్ రజినీకాంత్

ఇక ఇప్పుడు ఈ మూవీ కోసం స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా రంగంలోకి దిగడం విశేషం. ‘కన్నప్ప’ షూటింగ్ న్యూజిల్యాండ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. తాజాగా కన్నప్ప కోసం ప్రభుదేవా న్యూజిల్యాండ్ లో ల్యాండ్ అయ్యాడు. ఈ షెడ్యూల్ లో ఆయన కొరియోగ్రఫీలో పాటలు చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. షెల్డన్ చౌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. స్టీఫెన్ దేవస్సీ, మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.