పుష్ప 2 లో స్టార్ క్రికెటర్, లుక్స్ వైరల్

క్రికెటర్లు సినిమాలకు ప్రమోషన్ చేయడం అనేది చాలా అరుదు. కాని ఆ ట్రెండ్ స్టార్ట్ చేసింది మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన సినిమాలను జనాల్లోకి తీసుకు వెళ్ళడానికి అన్ని భాషల్లో మార్కెట్ పెంచుకోవడానికి మార్కెటింగ్ ఓ రేంజ్ లో స్టార్ట్ చేసాడు బన్నీ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 20, 2024 | 12:14 PMLast Updated on: Sep 20, 2024 | 12:14 PM

Star Cricketer David Warner In Puspa 2

క్రికెటర్లు సినిమాలకు ప్రమోషన్ చేయడం అనేది చాలా అరుదు. కాని ఆ ట్రెండ్ స్టార్ట్ చేసింది మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన సినిమాలను జనాల్లోకి తీసుకు వెళ్ళడానికి అన్ని భాషల్లో మార్కెట్ పెంచుకోవడానికి మార్కెటింగ్ ఓ రేంజ్ లో స్టార్ట్ చేసాడు బన్నీ. బాలీవుడ్ లేదు హాలీవుడ్ లేదు అన్ని భాషల్లో సినిమాలను ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు. గ్రౌండ్ లో క్రికెట్ ఆడే క్రికెటర్లు కూడా తన సినిమాలకు ప్రమోషన్ చేసే వరకు వెళ్ళారు. పుష్ప సినిమాలో తగ్గేదే లే అనే మేనరిజం బాగా వైరల్ అయింది.

ఇండియన్ క్రికెటర్లు కూడా దీన్ని బాగా ప్రమోట్ చేసారు. ఇక పుష్ప సినిమాలో ఫ్లవర్ అనుకుంటివా ఫైరు అనే డైలాగ్ కూడా బాగా వైరల్ అయిన మాట వాస్తవం. ఈ ప్రమోషన్స్ లో ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ది కీలక పాత్ర అనే మాట వాస్తవం. డేవిడ్ వార్నర్ పుష్ప సినిమా రీల్స్ ని ఓ రేంజ్ లో చేసాడు. ఇతర తెలుగు హీరోల సినిమాల రీల్స్ కూడా చేస్తూ ఉంటాడు. దానికి కారణం ఐపిఎల్ మార్కెట్. ఐపిఎల్ లో హైదరాబాద్ కు ఆడే డేవిడ్ వార్నర్… డేవిడ్ మామ గా ఫ్యాన్స్ కి బాగా దగ్గరయ్యాడు.

ఇప్పుడు మనోడు ఏకంగా తెలుగు సినిమాల్లో కూడా నటించేందుకు సిద్దమవుతున్నాడనే టాక్ వస్తోంది. పుష్ప 2 సినిమాలో డేవిడ్ వార్నర్ ఓ పాత్ర చేస్తున్నాడు అని టాక్. ఆస్ట్రేలియాలో మనాడికి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దీనితో పుష్ప 2 సినిమాను అక్కడ కూడా ప్రమోట్ చేయడానికి డేవిడ్ వార్నర్ తో చర్చలు జరిపింది అని వార్నర్ కూడా అందుకు ఓకే చెప్పాడని టాక్. తాజాగా హెలికాప్టర్ నుంచి దిగుతున్న ఓ ఫోటో బాగా వైరల్ అవుతోంది. ఇది పుష్ప 2 సినిమాలో ఇంటర్నేషనల్ డాన్ గా డేవిడ్ వార్నర్ ను చూపించే స్టిల్ అని అంటున్నారు జనాలు. పాత్ర నెగటివ్ అయినా హీరో విషయంలో పాజిటివ్ గా ఉంటుందట.