NTR : ర‌ష్మిక‌తో ఎన్టీఆర్ రొమాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర పార్ట్1 దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 24, 2024 | 11:35 AMLast Updated on: May 24, 2024 | 11:35 AM

Star Hero Junior Ntr Romance With Rashmika 2

 

 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర పార్ట్1 దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇక వార్2లో ఎన్టీఆర్ సరసన ఆలియా భట్, కియారా అద్వానీ నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా ఈ విషయంలో క్లారిటీ రాలేదు కానీ.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్ ఫైనల్ అయినట్టుగా ఓ వార్త వైరల్ అవుతోంది.

ముందుగా ఈ ప్రాజెక్ట్‌లో కియారా అద్వానీ పేరు వినిపించగా.. ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా హీరోయిన్‌గా భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. రెయిన్ బో, గర్ల్‌ ఫ్రెండ్‌ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు.. ధనుష్ కుబేర సినిమాలో నటిస్తోంది.అలాగే బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, మురుగదాస్ సినిమాలోను ఓకె అయింది. విక్కీ కౌశ‌ల్‌తోను ఓ సినిమా చేయడాకిని రెడీ అవుతోంది.

విజ‌య్ దేవరకొండ, రాహుల్ సంకృత్య‌న్ కాంబోలో రానున్న సినిమాలోనూ రష్మిక పేరే వినిపిస్తోంది. ఇక ఎలాగు ఆగష్టు 15న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ పుష్ప2 రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్, నీల్ సినిమా ఆఫర్ పట్టేసిందని అంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో మ‌హేష్‌ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన రష్మికకు.. ఎన్టీఆర్‌తో మాత్రం న‌టించే అవ‌కాశం రాలేదు. అందుకే ఎన్టీఆర్, నీల్ సినిమాలో ర‌ష్మిక‌ను ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ఒకవేళ.. ఇదే నిజమైతే రష్మిక ఖాతాలో మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ పడిపోయినట్టే.