Summer Films : సమ్మర్ ని టార్గెట్ చేసిన స్టార్ హీరోలు..!
టాలీవుడ్ (Tollywood) టాప్ హీరోల రాబోయే సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ పాన్-ఇండియా (Pan India) భారీ-బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం. దేనికదే ప్రత్యేకమైన శైలి, ఆసక్తికరమైన కథాంశంతో ఉన్నాయి. మొత్తం 6 మంది టాలీవుడ్ టాప్ స్టార్స్, పెద్ద హీరోలు తమ చిత్రాలను వేసవి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు.

Star heroes targeting summer..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్‌ల చిత్రం గేమ్ ఛేంజర్ ( game changer) షూటింగ్ దశలోనే ఉంది. ఇది ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది. ఆ తరువాత బుచ్చి బాబు చిత్రంలో జాయిన్ అవుతారు చరణ్. ఎన్టీఆర్ – దేవర (NTR – Devara) షూట్ ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. దీని తర్వాత తారక్ వెంటనే హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 (War 2)లో జాయిన్ అవుతాడు.
ప్రభాస్ కల్కి, రాజా సాబ్ ఈ సంవత్సరమే విడుదల కానున్నాయి. ఈ చిత్రాలతో పాటు, అతను ఈ వేసవిలో సలార్ సీక్వెల్ షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారు. మహేష్ బాబు – రాజమౌళితో సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ ప్రస్తుతానికి ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప2 (Pushpa2) షూట్‌ని జూన్‌లోగా పూర్తి చేసి, వెంటనే అట్లీ ప్రాజెక్ట్‌కి వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ జూన్‌లో OG సెట్స్‌లో జాయిన్ అవుతారని, ఉస్తాద్ భగత్ సింగ్‌ను (Ustad Bhagat Singh) ఒకేసారి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.