స్టార్ హీరోయిన్ నయనతార ఇప్పుడు వివాదాల చుట్టూ తిరుగుతోంది. నెట్ఫ్లిక్స్ లో ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ ఆమెకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఒక సమస్య తర్వాత మరో సమస్య చుట్టుముడుతూ నరకం స్పెల్లింగ్ రాపిస్తున్నాయి కోర్టు వ్యవహారాలు. ఎప్పుడు ఏ నోటీస్ ఎవరి నుంచి వస్తుందో అర్థం కాక నయనతార పట్టపగలే చుక్కలు చూస్తోంది. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో మొన్నామధ్య ధనుష్ నిర్మాతగా వచ్చిన ఒక సినిమాలో మూడు సెకండ్ల క్లిప్పు వాడారంటూ 10 కోట్లు డిమాండ్ చేస్తూ ధనుష్ నోటీసులు పంపించాడు. ఆ నోటీసుల గురించి నయనతార పెద్ద రచ్చ రచ్చ చేసింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ధనుష్ కు ఒక బహిరంగ లేక కూడా రాస్తూ తీవ్ర ఆరోపణలు చేసింది. ధనుష్ కావాలనే వేధిస్తున్నాడంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం తమిళ సినిమా పరిశ్రమను షేక్ చేసింది. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ఆ సినిమాను తన భర్త విగ్నేష్ డైరెక్ట్ చేశాడు. ఆ క్లిప్ గురించి ఇప్పటికి రాద్ధాంతం నడుస్తూనే ఉంది. ఇక తాజాగా నయనతారకు మరో సమస్య వచ్చి పడింది. చంద్రముఖి సినిమా నిర్మాతల నుంచి నయన్ కు నోటీసులు వచ్చాయి. తన డాక్యుమెంటరీ విషయంలో తమ అనుమతి లేకుండా సినిమాలోని కొన్ని సన్నివేశాలను వాడారంటూ నిర్మాతలు నెట్ఫ్లిక్స్ కు అలాగే నయనతారకు నోటీసులు పంపించారు. ఇందుకుగాను ఐదు కోట్లు నష్టపరిహారం చెల్లించాలని ఆ నోటీసుల్లో డిమాండ్ చేశారు. ఇదే డాక్యుమెంటరీ పై ధనుష్ ఇప్పటికే 10 కోట్లు డిమాండ్ చేయడం ఆ వ్యవహారం కోర్టులో నడుస్తుండటం, ఈ టైంలో చంద్రముఖి సినిమా నిర్మాతలు కూడా ఐదు కోట్లు డిమాండ్ చేస్తూ నయనతారకు నోటీసులు పంపడం సెన్సేషన్ అయింది. నయనతార డాక్యుమెంటరీ లో తన సినిమా కెరీర్ కు సంబంధించి అనేక విషయాలు చూపించింది. ముఖ్యంగా పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు బయట పెట్టింది. అలాగే తన కెరీర్లో సూపర్ హిట్ అయిన సినిమాలు గురించి ఎక్కువగా ఈ డాక్యుమెంటరీలో ప్రస్తావించారు. గజినీ సినిమా అలాగే చంద్రముఖి.. సహా మరికొన్ని తమిళ సినిమాలను ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన ఈ సినిమాలు.. కెరీర్ స్టార్టింగ్ లో బాగా హెల్ప్ అయ్యాయి. మరి ఈ నోటీసులపై నయనతార ఏవిధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. అయితే నయనతార ఫ్యాన్స్ మాత్రం కావాలనే ధనుష్ ఆమెను టార్చర్ చేయడానికి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటూ మండిపడుతున్నారు. తమిళ సినిమా పరిశ్రమంలో ధనుష్ మాట విని నయనతారను కొంతమంది టార్గెట్ చేశారని ఆమె ఫేమ్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో బూతుల పురాణం అందుకుంటున్నారు.[embed]https://www.youtube.com/watch?v=3evR_3Na8tc[/embed]