Venkatesh trisha : వెంకటేష్ తో త్రిష
టాలీవుడ్ (Tollywood) లో కొన్ని కాంబినేషన్లకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాంటి కాంబోలో వెంకటేష్(Venkatesh), త్రిష (Trisha) ఒకటి..వెంకటేష్, త్రిష కాంబినేషన్ లో మొదట వచ్చిన సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.

Star heroine Trisha will team up with Victory Venkatesh once again
టాలీవుడ్ (Tollywood) లో కొన్ని కాంబినేషన్లకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాంటి కాంబోలో వెంకటేష్(Venkatesh), త్రిష (Trisha) ఒకటి..వెంకటేష్, త్రిష కాంబినేషన్ లో మొదట వచ్చిన సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. 2007లో రిలీజైన ఈ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అప్పట్లో ఘన విజయం సాధించింది. తన శైలికి భిన్నంగా దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన ఈ మూవీ పెద్ద హిట్టుగా నిలిచింది. వెంకీ త్రిష జంటని ఆడియన్స్ ఫ్రెష్ గా ఫీలవ్వడమే కాక.. పాటలకు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. తర్వాత ఈ జోడీ 20009లో నమో వెంకటేశా చేసింది కానీ.. అది ఎబోవ్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. 2012లో బాడీ గార్డ్ భారీ అంచనాలు అందుకోలేక ఫెయిలయ్యింది. అయితే.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వెంకీ-త్రిష కాంబినేషన్‌కు ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ కాబోతుందన్న వార్త టాలీవుడ్‌లో వైరల్‌గా మారింది.
ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఈ జంట కలిసే అవకాశమున్నట్టు ఫిలిం నగర్ టాక్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోయే విలేజ్ డ్రామాలో త్రిషనే తీసుకునే ఆలోచన సీరియస్ గా జరుగుతోందట.. అయితే.. త్రిష డేట్స్ దొరకడం అంత సులభంగా లేదట. ఆల్రెడీ చిరంజీవి (Chiranjeevi) విశ్వంభర (Vishwambhara) కు బల్క్ కాల్ షీట్స్ ఇచ్చింది. ఇంకోవైపు కమల్ హాసన్ తగ్స్ లైఫ్, అజిత్ మూవీలను పూర్తి చేయాల్సి ఉంది. మోహన్ లాల్ రామ్, టోవినో థామస్ ఐడెంటిటీ పెండింగ్ ఉన్నాయి. వేసవిలోగా వీటిలో అధిక శాతం అయిపోతాయట.. దాని తర్వాతే వెంకీ మూవీ ఒప్పుకునే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.
కాగా.. స్టార్ డైరెక్టర్ అనీల్ రావిపూడి చివరిగా భగవంత్ కేసరి (Bhagwant Kesari) మూవీ తో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఆయన అంతకుముందు వెంకటేష్‌తో F2, F3 చిత్రాలతో ఆడియెన్స్‌ను అలరించారు. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. మరో వైపు ఇందులో హీరోయిన్‌గా త్రిష కూడా కనిపిస్తే ఇంక పండగే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.. మరి.. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఈ ముగ్గురి కాంబోలో మూవీ వస్తే బాగుంటుందని చాలా మంది కోరకుంటున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్టుపై ఏం జరుగుతుందో చూడాల్సిందే.