కల్కీ వాటిని మింగేస్తే.. దేవర రజినికి దెబ్బేశాడు.. ఇప్పుడు వీటికి బన్నీ…

కల్కీ సినిమా వచ్చినప్పుడు చాలా మూవీలు ఆ సునామీకి కొట్టకుపోయాయి... అచ్చంగా దేవర వచ్చినప్పుడు కూడా అలానే జరిగింది. పెద్ద పెద్ద్ హీరోల సినిమాలు పాన్ ఇండియా లెవల్లో కొట్టుకుపోయాయి. అలానే పుష్ప రాజ్ సీన్ లో ఉండగ వచ్చిన అరవ హీరోలకి అదే సీన్ రిపీట్ అయ్యిందా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 21, 2024 | 03:04 PMLast Updated on: Dec 21, 2024 | 3:04 PM

Star Heros Domination In South India

కల్కీ సినిమా వచ్చినప్పుడు చాలా మూవీలు ఆ సునామీకి కొట్టకుపోయాయి… అచ్చంగా దేవర వచ్చినప్పుడు కూడా అలానే జరిగింది. పెద్ద పెద్ద్ హీరోల సినిమాలు పాన్ ఇండియా లెవల్లో కొట్టుకుపోయాయి. అలానే పుష్ప రాజ్ సీన్ లో ఉండగ వచ్చిన అరవ హీరోలకి అదే సీన్ రిపీట్ అయ్యిందా? బాక్సాఫీస్ మహారాజా అనిపించుకున్న విజయ్ సేతుపతికి విడుదలై సీక్వెల్ షాక్ ఇచ్చిందా? క్రేజీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఉపేంద్ర యూఐ మూవీ బాక్సాఫీస్ కి పిచ్చెక్కించిందా? రంగస్థలం, దేవర స్టైల్లో మాస్ మతిపోగొట్టేందుకు వచ్చిన బచ్చల మల్లి ప్రయత్నం పులిచి చూసి, నక్క వాతలు పెట్టుకున్నట్టే అంటున్నారు. మొత్తంగా తెలుగు పాన్ ఇండియా మూవీలు, తమిళ, హిందీ సినిమాలనే కాదు, తెలుగు మూవీలను కూడా మింగేస్తున్నాయంటున్నారు.. ఫైనల్ గా ఈ వారం కూడా అదే నిజమైందా?

ఈ వారం తమిళ హీరో విజయ్ సేతుపతి విడుదదలై సీక్వెల్ వచ్చింది. మరో డబ్బింగ్ మూవీ యూఐ రిలీజైంది. తెలుగు ప్రయోగం బచ్చల మల్లీ కూడా రిలీజైంది… ఐతే ఈ ఏడాది బిగినింగ్ నుంచి చూస్తే, ప్రతీ సీజన్ లో తమిళ్, హిందీ, కన్నడ ప్రయోగాలకు, పాన్ ఇండియా మూవీలకు తెలుగు సినిమాలే బ్రేకులేశాయి

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ సినిమా వచ్చాకే శంకర్ , కమల్ కాంబినేషన్ లో భారతీయుడు 2 వచ్చింది. కాని ఏమైంది.. ఒకవైపు కథ వీక్ గా ఉండటం,మరో వైపు కల్కీ దుమ్ముదులపటంతో, రెండు రోజుల్లోనే భారతీయుడు 2 దుకానం సర్దేసింది..

తర్వాత సీజన్ లో దేవర మూవీ వచ్చింది.. ఐతే కాస్త ముందే వచ్చిన గోట్ టాక్ వీకవ్వటం, దేవర దుమ్ముదులపటంతో పాన్ ఇండియాలెవల్లో తెలుగు సినిమా కిందే తమిళ మూవీ గోట్ నలిగిపోయింది. తర్వాత వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ వెట్టయాన్ అడ్రస్ లేకుండా పోయింది.. అప్పడే వచ్చిన ఆలియ భట్ సినిమా జిగ్రా కూడా అడ్రస్ లేకుండాపోయింది.

ఇప్పుడు పుష్ప2 వంతొచ్చినట్టుంది. ఎందుకంటే పుష్ప 2 మూవీ మాంచి స్వింగ్ లో ఉన్నప్పుడే విజయ్ సేతుపతి విడుదలై2 వచ్చింది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఈ సీక్వెల్ గొప్పగాలేదన్న టాక్ కి, పుష్ప2 షాక్ తోడై రెండో రోజుకే తెలుగు, హిందీ మార్కెట్ లో సగం థియేటర్స్ ఎత్తేస్తున్నారట

ఇక కన్నడ క్రేజీ స్టార్ యూఏ మూవీ అయితే కథ కొత్తగా, పరమ చెత్తగా ఉందనే టాక్ నే సొంతం చేసుకుంది. కాకపోతే ఏ, ఉపేంద్ర, హెచ్ టూ ఓ, ఓంకారం లాంటి కల్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ కాబట్టి, తక్కువ ప్రచారంతోనే తన మూవీకి భారీ హైప్ వచ్చింది. కాని కంటెంట్ వీకనే టాక్ కి తోడు పుష్ప2 జోరు వల్లే, బన్నీమూవీ కిద్ద యూఐ కూడా నలిగిపోతున్నట్టే కనిపిస్తోంది.

విచిత్రం ఏంటంటే తెలుగు మూవీ బచ్చల మల్లీ కూడా పుష్ప 2 బాక్సాపీస్ కిందే నలిగిపోవాల్సి వస్తోంది. రంగస్థలం రేంజ్ లో వచ్చిన మూవీ అన్నారు. పుష్ప రాజ్ ఎలా బన్నీ కెరీర్ మార్చిందో అల్లరి నరేష్ ఫేట్ ని బచ్చల మల్లీ మారుస్తుందనుకంటే, పుష్ప రాజ్ కిందే ఈ సినిమా నలిగిపోవాల్సి వస్తోంది.. మొత్తంగా కల్కీ, దేవర, పుష్ప 2 మూవీల పుణ్యమాని పొరుగింటి సినమాలేకాదు, సొంతింటి ప్రయోగాలు కూడా నలిగిపోతున్నాయి.