మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ ఎప్పుడో మొదలైంది. కాని హీరో లేని సీన్లే తీస్తున్నాడు దర్శకుడు. వార్ 2 మూవీ షూటింగ్ ఈనెలాఖర్లోగా పూర్తవుతుంది. తర్వాతే డ్రాగన్ సెట్లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ కటౌట్ ఎంటరౌతుంది. ఇంతవరకు అందరికి తెలిసిందే... కొత్త సంగతేంటంటే, ఈ సినిమాలో హీరో మాత్రమే టాలీవుడ్ స్టార్.. మిగతాదంతా కన్నడ సరుకేనట. 1000 కోట్ల మ్యాన్ ఆఫ్ మాసెస్ కోసం 1300 కోట్ల బ్యాగ్రౌండ్ సౌండ్ ని కూడా రెడీ చేశాడు ప్రశాంత్ నీల్. సలార్ విషయంలో కూడా ఇదే జరిగింది. కాకపోతే సలార్ తో పోలిస్తే డ్రాగన్ లో కన్నడ రీసౌండ్ కి, రాఖీ భాయ్ వైబ్స్ తోడయ్యేలా ఉన్నాయి. చైనా విలన్, కొరియన్ కమేడియన్... ఇలా సినిమా లో పాన్ ఏసియా కంటెంట్ కూడా నిండుతున్నట్టుంది. అంతవరకు ఓకే కాని మళ్లీ కేజీయఫ్ మూడ్ లోకి పాన్ ఇండియాని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు ప్రశాంత్ నీల్. సలార్ లో మిస్ అయ్యింది. డ్రాగన్ లో మిస్ కాకుండా చూసేపనిలో ఉన్నాడని తెలుస్తోంది.. ఇంతకి డ్రాగన్ కి కేజీయఫ్ వైబ్స్ తోడవబోతున్నాయని, అనటానికి కారనం ఏంటి? ఆ ప్రచారం వెనకున్న లాజిక్ ఏంటి? త్రిబుల్ ఆర్ తో 1300 కోట్ల స్టార్ గా మారి ఎన్టీఆర్, తర్వాత దేవరతో 670 కోట్లు రాబట్టాడు. రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన తొలి హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు. అలాంటి తనతో ప్రశాంత్ నీల్ సినిమా అంటే సలార్ రేంజ్ లోనే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కాని కథ, కథనం మాత్రమే కాదు, అసలు డ్రాగన్ ప్రపంచమే కేజీయఫ్ ని రిప్లెక్ట్ చేసేలా ఉందట. సలార్ విషయంలో జరిగిన మిస్టేక్ ని డ్రాగన్ విషయంలో రిపీట్ కానీయకుండా జాగ్రత్త పడుతున్నాడు ప్రశాంత్ నీల్. నిజానికి సలార్ మూవీ 800 కోట్ల వసూళ్లు రాబట్టినా, రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో మాత్రం కొంత వెలితి కనిపించింది. దానికి కారనం సలార్ మూవీ కేజీయఫ్ స్టైల్లో ఉన్న కన్నడ మూవీ ఉగ్రం లా ఉందనే కామెంట్స్ రావటమే. నిజినికి ఇది ఉగ్రం రీమేక్ గానే వచ్చింది. కాకపోతే కేజీయఫ్ స్టైల్లో తీయటం వల్ల, ఇది కేజీయఫ్ లుక్కులో కన్నడ ఉగ్రం అనేశారు. అంతేకాదు మ్యూజిక్ మీద కూడా కాస్త డిసప్పాయింట్ మెంట్ కనిపించింది. కేజీయఫ్ స్టైల్ లోనే ఉగ్రం తీసినా, కేజీయఫ్ స్టైల్లో పాటలు లేవు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. అందుకే డ్రాగన్ విషయంలో అలాంటి లోపాలు లేకుండా రవి బ్రస్ రూర్ ని ముందే రంగంలోకి దింపాడు. షూటింగ్ కి ముందే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని, పాటల రికార్డింగ్ ని పూర్తి చేయిస్తున్నాడు ఆల్రెడీ పాటల కంపోజిషన్ అయిపోయింది. ప్రజెంట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వర్క్ నడుస్తోంది. ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. రాజమౌలి తర్వాత సందీప్ రెడ్డి వంగ మాత్రమే సినిమా షూటింగ్ కి ముందే తనమూవీ బ్యాగ్రౌండ్ వర్క్ ని పూర్తి చేయిస్తాడు... ఇప్పుడు ప్రశాంత్ నీల్ అదే పనిచేయిస్తున్నాడు డ్రాగన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వర్క్ పూర్తయ్యాకే ఎన్టీఆర్ సెట్లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఐతే కేజీయఫ్ కి బ్యాగ్రౌండ్ ని ఎలా ప్లాన్ చేశారో డ్రాగన్ కి అలా మ్యూజిక్ ని ప్లాన్ చేయటమే కాదు, రంగంలోకి శ్రీనిధి ని కూడా సింగిల్ సాంగ్ కోసం తీసుకొస్తున్నారట. ఇక కేజీయఫ్ లోని విలన్ బ్యాచ్ మొత్తం ఈ మూవీకోసం రంగంలోకి దిగింది. అంటే హీరో తప్ప ఈమూవీలో మొత్తం సరుకంతా కేజీయఫేనా అంటే ఆల్ మోస్ట్ అదే నిజం. కాకపోతే అంతకుమించేలా సినిమా ప్లానింగ్, పర్ఫెక్షన్ తో ప్రశాంత్ నీల్ ప్రిపరేషన్ ఏదో సెన్సేషన్ జరిగేలా ఉంది. [embed]https://www.youtube.com/watch?v=W6jVWQt6Mwo[/embed]