మురారీ రీ రిలీజ్ పై స్టార్ నిర్మాత సెన్సేషనల్ కామెంట్స్

టాలీవుడ్ లో ఇప్పుడు రీ రిలీజ్ ల హవా పెద్ద ఎత్తున నడుస్తున్న సంగతి తెలిసిందే. రీ రిలీజ్ ను పక్కాగా ప్లాన్ చేసి విడుదల చేస్తున్నారు. హీరోల పుట్టిన రోజుని దృష్టిలో పెట్టుకుని ఈ రిలీజ్ లు ఉంటున్నాయి. త్వరలోనే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రెండు సినిమాలను రీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 19, 2024 | 12:52 PMLast Updated on: Aug 19, 2024 | 12:52 PM

Star Producer Sensational Comments On Murari Re Release

టాలీవుడ్ లో ఇప్పుడు రీ రిలీజ్ ల హవా పెద్ద ఎత్తున నడుస్తున్న సంగతి తెలిసిందే. రీ రిలీజ్ ను పక్కాగా ప్లాన్ చేసి విడుదల చేస్తున్నారు. హీరోల పుట్టిన రోజుని దృష్టిలో పెట్టుకుని ఈ రిలీజ్ లు ఉంటున్నాయి. త్వరలోనే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రెండు సినిమాలను రీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి సినిమాను కూడా రీ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో సైతం ఈ సినిమాకు క్రేజ్ ఏర్పడింది.

ప్రస్తుతం ఈ సినిమాను ఫాలో అయ్యే బాటలో ఇతర హీరోలు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఇలా రిలీజ్ అయిన సినిమాల్లో మురారి సినిమానే ఈ రేంజ్ లో హిట్ టాక్ సొంతం చేసుకుందనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు చేసారు. థియేటర్‌కు జనం రావాలంటే, ఏదైనా సందర్భం ఉండాలి అన్నారు ఆయన. మహేశ్‌ బాబు పుట్టిన రోజు ఉంది కాబట్టే ‘మురారి’కి మంచి ఆదరణ వచ్చింది అని స్పష్టం చేసారు. ఒక మూడ్‌ క్రియేట్‌ అయితే తప్ప ప్రేక్షకులు రారు అన్నారు.

ఇటీవల రిలీజ్ అయిన ‘ఆయ్‌’ మూవీకి భారీగా పబ్లిసిటీ చేసి, సాధారణ రోజుల్లో విడుదల చేస్తే 20 నుంచి 25 శాతం ఓపెనింగ్‌ వస్తుంది అన్నారు. ఇప్పుడు వరుస సెలవులు వచ్చాయి కాబట్టి ఆ సినిమాకు 42 నుంచి 45 ఓపెనింగ్‌ అయిందన్నారు. అలా కాకుండా మౌత్‌ టాక్‌ తో వెళ్తే మూడో వారానికి అందుకుంటుంది అని చెప్పుకొచ్చారు. అందులో నాకు 35 శాతం, మల్టీప్లెక్స్‌ వాళ్లకు 65 శాతం వెళ్లుంది అన్నారు. గ్రాస్‌ కనపడుతుంది తప్ప, షేర్‌ కనపడదని కామెంట్స్ చేసారు. ఇది వరకు ఉన్నట్లు థియేటర్లలో పరిస్థితులు అనుకూలంగా లేవు అంటూ చెప్పుకొచ్చారు బన్నీ వాసు.