Harish Shankar : ఆగిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్.. రవితేజ తో హరీష్.. పీరియాడికల్ డ్రామా
కమర్షియల్ సినిమాలను పర్‌ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయడంలో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దిట్ట. షాక్ సినిమా మినహాయించి హరీష్ డైరెక్ట్ చేసిన ప్రతీ సినిమా యూత్ ను ఊపేసింది. గబ్బర్ సింగ్ సినిమా తో అయితే ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టాడు. ఓ అభిమానే హీరోను డైరెక్ట్ చేస్తే అవుట్ పుట్ ఏ రేంజ్‌లో ఉంటుందో గబ్బర్ సింగ్ సినిమా చూపించాడు.
కమర్షియల్ సినిమాలను పర్‌ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయడంలో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దిట్ట. షాక్ సినిమా మినహాయించి హరీష్ డైరెక్ట్ చేసిన ప్రతీ సినిమా యూత్ ను ఊపేసింది. గబ్బర్ సింగ్ సినిమా తో అయితే ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టాడు. ఓ అభిమానే హీరోను డైరెక్ట్ చేస్తే అవుట్ పుట్ ఏ రేంజ్‌లో ఉంటుందో గబ్బర్ సింగ్ సినిమా చూపించాడు. పదకొండేళ్ల కిందట కలిసిన ఈ కాంబో మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ తో కలిశారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్.. సోషల్ మీడియాను షేక్ చేసింది. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని అభిమానుల్లో ఎగ్జయింటింగ్ గా ఎదురుచూస్తుండగా.. ఊహించని షాక్ తగినట్లు తెలుస్తోంది.
Assembly Elections: తెలంగాణ ఎన్నికల బరిలో ఎంతమంది..? అత్యధికంగా పోటీ చేస్తోంది ఇక్కడి నుంచే..
ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన ఉస్తాద్ భగత్ సింగ్ తొలినాళ్లలో స్పీడ్ గా షూటింగ్ జరుపుకుని.. ఆ తర్వాత నెమ్మదించింది. అప్పటికే దాదాపు 50% షూటింగ్ కంప్లీట్ అయిన ఈ ప్రాజెక్ట్‌పై గత కొన్ని నెలలుగా ఉలుకూ, పలుకూ లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే క్లారిటీ కూడా లేదు. దీంతో సోషల్ మీడియాలో ఆ ప్రాజెక్ట్ కాన్సిల్ అయిందని వార్తలు వచ్చాయి. పైగా త్వరలోనే ఏపీలో ఎన్నికలు ఉండటంతో ఈ సినిమా పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు ఎనిమిది నెలల వరకు గ్యాప్ వచ్చే ఛాన్స్ ఉండటంతో పవన్ కూడా హరీష్ కు మరో సినిమా చేసుకోమని సలహా ఇచ్చినట్లు ఓ న్యూస్ చక్క ర్లు కొడుతోంది. పవర్ స్టార్ సూచన మేరకు హరీష్.. అచ్చొచ్చిన హీరోతో మూవీకి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
హరీష్ శంకర్ తన తదుపరి సినిమా రవితేజ తో మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.మాస్ మహారాజ్ తో ఓ భారీ పీరియాడికల్ డ్రామా కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రవితేజ లుక్ టెస్ట్ కూడా ఒక ప్రైవేట్ స్టూడియోలో చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలు కానుందని టాక్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశారట. ఈగల్ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే రవితేజ.. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడట. నాలుగేళ్ల కిందట వచ్చిన గద్దలకొండ గణేష్ తర్వాత హరీష్ ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. దీంతో ఉస్తాద్ పై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ.. కంప్లీట్ అయ్యేందుకు చాలా టైం పడుతోంది. దీంతో ఉస్తాద్ కు బ్రేక్ ఇచ్చి రవితేజ తో మూవీకి ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుందని సమాచారం అందింది. అంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా అయితే ఇప్పట్లో లేనట్టే అని అర్థం అవుతోంది. ఎన్నికలు అయ్యాక పరిస్థితులను చూసుకొని అప్పుడు తిరిగి షూటింగ్ చెయ్యాలా వద్దా అనే విషయం మీద నిర్ణయం తీసుకుంటారు అని తెలుస్తోంది.