స్టైలిష్ స్టార్ vs మెగా గ్లోబల్ స్టార్… అక్కడ తగ్గేది ఎవరు..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప2 వస్తే సీన్ రివర్స్ అవుతుందన్నారు. ఇక డిసెంబర్ లో బన్నీకి సినిమా కష్టాలే అనేశారు. దీనికి తోడు డిసెంబర్ 27న గేమ్ ఛేంజర్ వస్తే పుష్ప 2 వసూళ్లకి గండి పడుతుందన్నారు. కట్ చేస్తే రిలీజ్ కిముందే సీన్ మారిపోయింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప2 వస్తే సీన్ రివర్స్ అవుతుందన్నారు. ఇక డిసెంబర్ లో బన్నీకి సినిమా కష్టాలే అనేశారు. దీనికి తోడు డిసెంబర్ 27న గేమ్ ఛేంజర్ వస్తే పుష్ప 2 వసూళ్లకి గండి పడుతుందన్నారు. కట్ చేస్తే రిలీజ్ కిముందే సీన్ మారిపోయింది. మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజరే సంక్రాంతికి వాయిదా పడింది. అంటే పుష్ప2 ముందు గేమ్ ఛేంజర్ తగ్గాల్సి వచ్చిందా? ఈ డౌట్ కంటే పెద్దడౌట్, పుష్ప2 నిజంగానే బాక్సాఫీస్ ని షేక్ చేస్తే ఏంటి పరిస్థితి… ముందుగా పుష్పరాజ్ ఈసారి ఓవర్ సీస్ లో, నార్త్ ఇండియా బాక్సాఫీస్ లో యాసిడ్ టెస్ట్ పాస్ అవ్వాలి… దీనికి తోడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రియేట్ చేసిన దేవర రికార్డులు రీచ్ అవ్వాలి.. ఈ రెండు పుష్ప 2 ముందున్న టార్గెట్స్.. కాబట్టి పుష్పరాజ్ టీమే టెన్షన్ పడాలి.. కాని పుష్ప కంటే గేమ్ ఛేంజర్ టీం కే టెన్షన్ పెరుగుతోంది. దానికో సాలిడ్ రీజనుంది, అల్లు ఆర్మీ కి కూడా ఆ లాజిక్ వెనకున్న మ్యాజిక్ షాక్ ఇచ్చేలా ఉంది? ఇంతకి అదేంటి? ఇంకా సోషల్ మీడియాలో కూడా బన్నీదే పైచేయి అవుతోంది… అక్కడ మాత్రం సీన్ రివర్స్ లోఉంది ఎందుకు?
పాన్ ఇండియా మార్కెట్, పాన్ ఇండియా ఇమేజ్ తో ఇప్పుడు హీరోల రేంజ్ ని కొలవటం కామనైంది. ఐతే సోషల్ మీడియా మరీ ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ తో కూడా స్టార్స్ ఇమేజ్ ని కొలిస్తే, అందులో కనీసం 14 లక్షల మంది సపోర్ట్ తో ఐకాన్ స్టార్ బన్నీ, రామ్ చరణ్ నే మించాడు. చరణ్ కి 25 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే, బన్నీకి 26.4 మిలియన్ల ఫాలో వర్స్ ఉండట. ఎలా చూసినా చరణ్ ని బన్నీ చాలా విషయాల్లో దాటేస్తున్నాడు
ఇలా సోషల్ మీడియాలోనే కాదు మార్కెట్ లో కూడా, పుష్ప 2 వల్ల గేమ్ ఛేంజర్ టీంలో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే, పుష్ప 2 డిసెంబర్ 6న రాబోతోంది. రెండు వారాలా గ్యాప్ లో రావాల్సిన గేమ్ ఛేంజర్ సంక్రాంతికి వాయిదా పడింది.
దీంతో దేవర రికార్డులని పుష్ప2 బ్రేక్ చేస్తుందా? దేవర రేంజ్ లో పుష్ప 2 కి ఓపెనింగ్స్ వస్తాయా? ఓవర్ సీస్ లో పుష్ప2 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరలా దూసుకెళుతుందాలాంటి ప్రశ్నలు తలెత్తాయి. కాబట్టి ఈ డౌట్లను, రికార్డులను రీచ్ అవటం, కుదిరితే బ్రేక్ చేయటం ఐకాన్ స్టార్ బన్నీ ముందున్న టార్గెట్ లు…
కాబట్టి సుకుమార్, బన్నీలే ఎక్కువ టెన్షన్ పడాలి. కాని గేమ్ ఛేంజర్ టీంలో టెన్షన్ పెరుగుతోంది. కారణం. పుష్ప 2 హిట్టైనా, దేవర రికార్డులను బ్రేక్ చేసినా, కొత్త హోమ్ వర్క్ గేమ్ ఛేంజర్ కి పెరుగుతుంది. ఒకవైపు దేవర రికార్డులని రీచ్ అవ్వాలి, వాటిని బ్రేక్ చేయాలనే టార్గెట్ గేమ్ ఛేంజర్ కి ఉంటుంది. దీనికి తోడు మెగా ఫ్యామిలీతో పరోక్షంగా కయ్యానికి కాలుదువ్వి దూరంగా ఉన్న బన్నీ, పుష్ప 2 తోరికార్డులు క్రియేట్ చేస్తే, వాటిని రీచ్ అవటమో బ్రేక్ చేయటమో చేయాలి.
సో ఇది అదనపు హోమ్ వర్క్ లాంటిదే… దేవర సరైన టైంలో రిలీజ్ అయ్యింది. పుష్ప 2 కూడా సాలిడ్ సీజన్ లోనే వస్తోంది. ఎటొచ్చి గేమ్ ఛేంజర్ కి సంక్రాంతి కలిసొచ్చే ఛాన్స్ ఉన్నా, సీన్ రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే, పోటీగా వెంకీ అండ్ కో వస్తున్నారు. పాన్ ఇండియా మూవీ ఏది వచ్చినా నార్త్ ఇండియా మార్కెట్ ఎంత ముఖ్యమో, టాలీవుడ్ మార్కెట్ కూడా అంతే ముఖ్యం. రెండు భారీ మార్కెట్లు కాబట్టి ఈరెండు మార్కెట్లలో ఎక్కడ పోటీ ఉన్నా నష్టమే.. దీనికి తోడు భారతీయుడు 2 మరీ ఘోరంగా ఫ్లాప్ అవటం, అదే డైరెక్టర్ మేకింగ్ లోగేమ్ ఛేంజర్ తెరకెక్కడంతో, ఆ ఎఫెక్ట్ దీనిమీద ఎక్కడ పడుతుందో అన్న టెన్షన్ ఉండటం కామన్…
మొత్తానికి పుష్ప 2 కి ప్రీరిలీజ్ బిజినెస్ కలొసచ్చింది. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ లిస్ట్ మరింత పెరింగింది. బడా డైరెక్టర్ల సపోర్ట్ లేకుండా పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ వచ్చింది. తెలుగు హీరోల్లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి హీరోగా హిస్టరీ క్రియేట్ అయ్యింది. ఇలా అన్నీ కలిసొస్తున్న ఏడాది కాబట్టే, వాయిదాల్లేకుండా పుష్ప 2ని డిసెంబర్ 6 కి గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి ఇది ఏమాత్రం కలిసొచ్చినా, దేవర, పుష్ప 2 రికార్డులు గేమ్ ఛేంజర్ ని తట్టుకోలేని భారంగా మారేలా ఉన్నాయి.