ఢీ షోలో వరస ఆత్మహత్యలు.. అక్కడేం జరుగుతుంది..? ఇంకెన్ని వివాదాలు..?

తెలుగు బుల్లితెరపై ఢీ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అక్కడ్నుంచే చాలా మంది కొరియోగ్రఫర్లు టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న శేఖర్ మాస్టర్..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 3, 2025 | 02:20 PMLast Updated on: Mar 03, 2025 | 2:20 PM

Successive Suicides In Dhi Show What Happens There

తెలుగు బుల్లితెరపై ఢీ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అక్కడ్నుంచే చాలా మంది కొరియోగ్రఫర్లు టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న శేఖర్ మాస్టర్.. ప్యాన్ ఇండియన్ కొరియోగ్రఫీ చేస్తున్న జానీ మాస్టర్ కేరాఫ్ కూడా ఢీ షోనే. మోస్ట్ టాలెంటెడ్ కొరియోగ్రఫర్లను తెలుగు ఇండస్ట్రీకి అందిస్తున్న ఈ షో చుట్టూ ఎప్పుడూ వివాదాలు కూడా అలాగే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ షోలో అమ్మాయిలకు అస్సలు సేఫ్టీ లేదని చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఓ డాన్సర్ ఆత్మహత్య చేసుకోవడంతో విషయం మరింత పెద్దదవుతుంది. ఖమ్మం జిల్లాలోని పొన్నెకల్లులో సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్యకు పాల్పడింది ఢీ ఢాన్సర్ కావ్య కళ్యాణి. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దెబ్బకు ఢీ షో మరోసారి ట్రెండింగ్ అవుతుంది.

ఈ షోలోనే డాన్సర్‌గా ఉన్న అభిలాష్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడని.. ఐదేళ్లుగా కాపురం చేస్తున్నామని.. అయితే ఈ మధ్య అభి తనను కావాలనే దూరం పెడుతున్నాడని ఆ వీడియోలో చెప్పింది యువతి. మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయాడని.. అందుకే తాను చనిపోతున్నానని.. తన చావుకు కారణం అభి అంటూ ఉరి వేసుకుంది కావ్య కళ్యాణి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు యువతిని కిందకు దించారు. కానీ అప్పటికే ఆమెలో చలనం కనిపించలేదు.. డాక్టర్‌ను వచ్చినా చనిపోయిందని చెప్పాడాయన. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. అయితే ఢీ షోలో ఆత్మహత్యలు ఇదేం కొత్త కాదు.. రెండేళ్ళ కింద ఢీ కొరియోగ్రఫర్ చైతన్య మాస్టర్ సూసైడ్ అప్పట్లో సంచలనంగా మారింది.

ఆయన చావుకు ఓ రకంగా ఢీ షోనే కారణమంటూ చాలా పెద్ద రచ్చ జరిగింది. అవసరానికి మించి చేసిన అప్పులే ఆయన్ని బలి తీసుకున్నాయంటూ చెప్పుకొచ్చారు స్నేహితులు. అప్పులెందుకు చేసాడంటే.. ఢీ షోలో బడ్జెట్ తక్కువగా ఇస్తారని.. పాటల్ని మరింత రిచ్‌గా తెరకెక్కించేందుకు అప్పులు చేసాడన్నారు. అయితే చైతన్య మాస్టర్ చనిపోయిన తర్వాత కూడా ఢీకి సంబంధించిన ఏ ఒక్కరు దీనిపై స్పందించలేదు. ఇక జానీ మాస్టర్ వివాదం కూడా ఢీ చుట్టూనే తిరిగింది. తన దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్న అమ్మాయిని వేధిస్తున్నాడంటూ జానీపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చాడు. మ్యాటర్ ఏదైనా.. ఢీ షో వివాదాస్పదంగా మారుతుందిప్పుడు.