Daniel Balaji : డానియల్ బాలాజీ హఠాన్మరణం
తమిళ చిత్రసీమలో (Tamil Cinema) పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ (Daniel Balaji) హఠాన్మరణం చెందారు. నిన్న రాత్రి గుండెపోటు తో మరణించాడని తెలుస్తుంది.

Sudden death of Daniel Balaji
తమిళ చిత్రసీమలో (Tamil Cinema) పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ (Daniel Balaji) హఠాన్మరణం చెందారు. నిన్న రాత్రి గుండెపోటు తో మరణించాడని తెలుస్తుంది. ఈ సంఘటనతో యావత్తు తమిళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది. ఎంతో భవిష్యత్తు ఉన్న డానియల్ మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
తెలుగు ప్రేక్షకులకి కూడా డానియల్ సుపరిచితుడే. వెంకటేష్ (Venkatesh) హీరోగా 2004 లో వచ్చిన తమిళ రీమేక్ ఘర్షణ లో పోలీస్ ఆఫీసర్ గా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఒరిజినల్ లోను నటించి ఇరవై ఏళ్ళ క్రితమే బహు బాషా నటుడుగా గుర్తింపుని పొందాడు. వాస్తవానికి ఆయన నటన టెలివిజన్ రంగంతో ప్రారంభం అయ్యింది. చిట్టి అనే ఒక సీరియల్ లో డానియల్ అనే క్యారక్టర్ ని పోషించాడు. ఆ సీరియల్ హిట్ లో ఆ పాత్ర చాలా ప్రాముఖ్యతని పోషించింది. ఇక అప్పటినుంచి ఆయనకి డానియల్ బాలాజీ అనే పేరు వచ్చింది. చిట్టి సీరియల్ తెలుగులో పిన్ని పేరుతో టెలికాస్ట్ అయ్యింది. 2006 లో కమల్‌హాసన్ హీరోగా వచ్చిన వెట్టైయాడు విలయాడులో ఆయన పోషించిన సైకో క్యారెక్టర్ కి మంచి గుర్తింపు వచ్చింది.
ఇక అక్కడనుంచి అయన వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి యాభైకి పైగా సినిమాలు చేసాడు. కాక కాక, పొల్లదావన్, మిత్వేడి, మరుముగం,ఎన్నై అరిందాల్, భైరవ ,వడ చెన్నై, గ్యాంగ్ ఆఫ్ మద్రాస్, బిగిల్ చిత్రాలు ఆయనకీ మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులో సాంబ, ఘర్షణ, చిరుత, టక్ జగదీష్ సినిమాల్లో కూడా సూపర్ గా నటించాడు. కన్నడ, మలయాళ భాషల్లో కూడా 12 సినిమాల దాకా చేసాడు. డైరెక్షన్ కోర్స్ చేసి నటుడు గా మారిన డానియల్ వయసు ప్రస్తుతం 48 సంవత్సరాలు. స్వస్థలం చెన్నై. ఆయన తండ్రి తెలుగు పేరు మురళి. తెలుగు వాడైన ఆయన నటుడుగా కొన్ని తమిళ సినిమాల్లో చేసాడు. అమ్మ మాత్రం తమిళనాడు ఆమె. ప్రముఖ తమిళ నటుడు అధర్వ మురళి ఆయనకి కజిన్ అవుతాడు. బ్యాచులర్ లైఫ్ బెస్ట్ అని పెళ్లిచేసుకోలేదు. విలన్ క్యారక్టర్ కి ఒక సరికొత్త స్టైల్ ని డానియల్ బాలాజీ తీసుకొచ్చాడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు..