సడన్ గా బాంబ్ పేల్చారు.. కల్కీ2 కోసం పెద్ద తలకాయలు…

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేందుకు రంగంలోకి దిగాడు నాగ్ అశ్విన్. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ విషయంలో 4 కండీషన్స్ తో అసలైన సెన్సేషన్ కి అడుగు ముందుకేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 17, 2025 | 07:15 PMLast Updated on: Mar 17, 2025 | 7:15 PM

Suddenly A Bomb Exploded Big Heads For Kalki 2

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేందుకు రంగంలోకి దిగాడు నాగ్ అశ్విన్. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ విషయంలో 4 కండీషన్స్ తో అసలైన సెన్సేషన్ కి అడుగు ముందుకేశాడు. తన వల్ల ప్రశాంత్ నీల్ లో ఊపొచ్చింది. సలార్ 2 ఎప్పుడు పట్టాలెక్కుతుందో తేలింది.కట్ చేస్తే ఇప్పుడు నాగ్ అశ్విన్ ఒకటి కాదు, ఏకంగా నాలుగు అడుగులు ముందుకేశాడు. కల్కీ 2 పనులు సైలెంట్ గా పూర్తయ్యాకని తేల్చాడు. అంటే కల్కీ 2 కోసం నాలుగు నెలలుగా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్న తను, ఇక షూటింగ్ కి మూడడుగులు దూరమే అని తేల్చాడు. ఇది నిజంగా రెబల్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే విషయమే… కాని ఫౌజీ, రాజా సాబ్, స్పిరిట్ ఇవయ్యే వరకు కల్కీ 2 కి ఛాన్సే లేదనే అభిప్రాయముంది.. కానిఇక్కడే ట్విస్ట్ ఇస్తున్నాడు నాగశ్విన్. మే లో కల్కీ 2 ని పట్టాలెక్కిస్తున్నాడు. దుమ్ముదులిపేయబోతున్నాడు.. కాని ఇదేలా సాధ్యం… చూసేయండి.

రెబల్ స్టార్ కల్కీ సీక్వెల్ సెట్స్ పైకెళ్లబోతోంది. అది కూడా మేనెలలోనే… ఇంతవరకు ఒక్క చిన్న అప్ డేట్ లేదు. చిన్న క్లూ కూడా రాలేదు. ఆల్ ఆఫ్ సడన్ గా మే నుంచి రెగ్యులర్ షూటింగ్ కి టీం ని అలర్ట్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఏకంగా అమితాబ్ బచ్చన్ బల్క్ గా డేట్లిచ్చాడు… కమల్ హాసన్ అయితే 55 రోజుల కాల్ షీట్స్ ని కేటాయించాడు.తల్లయ్యాక దీపికా పదుకొనే ఇంకే సినిమాలకు కమిట్ కాలేదు. ఈమధ్యే తను పబ్లిక్ గా కనిపించటం మొదలైంది. ఓ బిడ్డకు తల్లిగా మారాక, పూర్తిగా లోప్రొఫైల్ మేయింటేన్ చేసిన తను, ఇప్పడిప్పుడే మీడియా ముందుకొస్తోంది. అలాంటి తను కల్కీ 2 కోసం ఒకటి కాదు రెండు మూడు అడుగులు ముందుకేసింది. విచిత్రం ఏంటంటే, తన డెలివరి తర్వాత ఆరునెలలో సంవత్సరానికో కల్కీ 2 సెట్స్ లో అడుగుపెడుతుందన్నారు.

కాని అందరికంటే ముందు కల్కీ 2 సెట్స్ లో అడుగుపెట్టేది దీపికా పదుకొనేనే అని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే ఈ మూవీకి హీరో అయిన ప్రభాసే చివర్లో సెట్లోకి వస్తాడట. రాజా సాబ్ ప్యాచ్ వర్క్, సాంగ్స్ షూటింగ్ తో పూర్తవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. కాని ఫౌజీ 20 శాతమే షూటింగ్ జరిగింది. జూన్ లో సందీప్ రెడ్డి వంగ మూవీ స్పిరిట్ పట్టాలెక్కబోతోంది.సో ఎలా చూసినా ఈ ఏడాది మరే మూవీకి ప్రభాస్ కాల్ షీట్స్ ఇచ్చే ఛాన్స్ లేదు. కాని అక్కడే మతలబుంది. కల్కీ 2 లో కథంతా నాలుగు పాత్రల మధ్యే తిరుగుతుంది. భైరవగా ప్రభాస్, అశ్వథ్ధామగా అమితాబ్, యాష్కిన్ గా కమల్, సునితగా దీపికా పదుకొనే.. ఈ నలుగురిలో అమితాబ్, దీపికా, కమల్ హాసన్ తాలూకు సెపరేట్ సీన్లన్నీ మే నుంచి షూటింగ్ చేయబోతున్నాడు నాగ్ అశ్విన్..

కాబట్టి ప్రజెంట్ ప్రభాస్ సెట్లో అడుగుపెట్టకున్న పర్లేదు. మే, జులై, ఆగస్ట్ అక్టోబర్ లో అస్సలు ప్రభాస్ లేని సీన్లను తీస్తూ కల్కీ లో చాలా పార్ట్ షూటింగ్ చేస్తాడట నాగ్ అశ్విన్. ఆతర్వాత నవంబర్ నుంచి కల్కీ 2 సెట్లోకి రెబల్ స్టార్ అడుగుపెట్టి అసలు స్పీడ్ పెంచేస్తాడు. ఆలోగా స్పిరిట్ లో మేజర్ టాకీ పార్ట్ షూటింగ్ ని సందీప్ రెడ్డి వంగ పూర్తి చేయబోతున్నాడు. సో ఇలా పక్కా ప్లానింగ్ తోనే కల్కీ 2 ని మే మంథ్ లో మొదలు పెట్టబోతున్నాడు నాగ్ అశ్విన్.