Thalapathy Vijay: కాపీ క్యాట్.. దళపతి విజయ్‌పై సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఫైర్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ 68వ సినిమాకి 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (GOAT)' అనే టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు తెలుగునాట ఈ టైటిల్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దానికి కారణం అదే టైటిల్‌తో మరో సినిమా వస్తుండటమే.

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన 68వ సినిమాని వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్నాడు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (GOAT)’ అనే టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు తెలుగునాట ఈ టైటిల్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దానికి కారణం అదే టైటిల్‌తో మరో సినిమా వస్తుండటమే. బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్.. వెండితెర మీద కూడా బాగానే రాణిస్తున్నాడు.
Sankranti box office : సంక్రాంతి పోరు బాక్సాఫీస్ పందెం.. తగ్గేదేలే అంటోన్న హీరోలు
ప్రస్తుతం అతను G.O.A.T అనే సినిమాలో నటిస్తున్నాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో మహాతేజ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే గ్లింప్స్ విడుదలైంది. అయితే ఇప్పుడు ఇంచుమించు ఇదే టైటిల్‌తో విజయ్ సినిమా కూడా వస్తుంది. సుధీర్ సినిమాకి G.O.A.T అనే టైటిల్ పెడితే, విజయ్ సినిమాకి ముందు ‘ది’ జోడించి ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే టైటిల్ పెట్టారు. దీంతో విడుదల సమయంలో విజయ్ సినిమాకి తెలుగులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో చూడాలి. విజయ్ గత చిత్రం ‘లియో’కి కూడా తెలుగునాట టైటిల్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ టైటిల్‌ని అప్పటికే తెలుగులో ఒకరు రిజిస్టర్ చేసుకొని ఉండటం, వారు కోర్టుని ఆశ్రయించడంతో.. ‘లియో’ విడుదలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే నిర్మాతలు వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకున్నారు. మరి ఇప్పుడు ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ విషయంలో కూడా అలాంటి సమస్యలు ఎదురవుతాయేమో లేక సాఫీగా విడుదలవుతుందో చూద్దాం. విడుదల సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలీదు కానీ.. టైటిల్ ప్రకటనతోనే విజయ్‌పై సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమ సుధీర్ టైటిల్ ఎందుకు పెట్టుకున్నారు.. మార్చండి అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.