Comedian, hero Suhas : 3 వేల నుంచి 3 కోట్ల వరకు.. తగ్గేదేలే
క్యారెక్టర్ ఆర్సిస్ట్గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్.. కమెడియన్ గా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించి మెప్పించారు సుహాస్.. కలర్ ఫోటో సినిమాతో హీరోగానూ సక్సె్స్ అయ్యారు.

Suhas' craze changed drastically with this movie. Suhas is currently busy with a series of films
క్యారెక్టర్ ఆర్సిస్ట్గా (Character, Artist ) ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్.. కమెడియన్ గా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించి మెప్పించారు సుహాస్.. కలర్ ఫోటో సినిమాతో హీరోగానూ సక్సె్స్ అయ్యారు. ఈ సినిమాతో సుహాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు సుహాస్. ఇటీవల ఫ్యామిలీ డ్రామా సినిమాతో ప్రేక్షకులను అలరించిన సుహాస్ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇక ఇవే కాకుండా.. తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. అయితే ఈ సినిమా కోసం సుహాస్ తన రెమ్యునరేషన్ పెంచినట్లుగా సమాచారం.
ఛాయ్ బిస్కెట్‌లో చిన్న చిన్న కామెడీ వీడియోలు చేసుకునే సుహాస్ (Suhas).. అక్కడి నుంచి ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదిగాడు. కొన్ని సినిమాలలో హీరో ఫ్రెండ్ రోల్స్ లో నటించి తనదైన కామెడీ టైమింగ్ తో సుహాస్ మెప్పించాడు. ఒక్కో షార్ట్ ఫిల్మ్ కు 3 వేల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయి నుంచి తాజాగా ఒక్కో సినిమాకు.. దాదాపు 3 కోట్ల పారితోషికం తీసుకునే హీరోగా మారిపోయాడు. పైగా ఎలాంటి పాత్ర అయినా అద్భుతంగా చేస్తాడని నమ్మకంతో మేకర్స్ సైతం సుహాన్ కోసం క్యూ కడుతున్నారు. భిన్నమైన కథలకు ఓటేయడంతో పాటు ఆ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సినిమాల విషయంలో సుహాస్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఇక సుహాస్ లేటేస్ట్ గా అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చేస్తున్నారు. దుష్యంత్ కాటికినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేయనుంది. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ తెలుగు టూ స్టేట్స్‌లో సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకోవడమే కాదు.. ఈ సినిమాపై మంచి అంచనాలను పెరిగేలా చేసింది. కథ నచ్చితే ప్రయోగాత్మక పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సుహాస్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. సుహాస్ భవిష్యత్తు సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే హీరోగా సుహాస్ స్థాయి మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.