Allu Arjun: పుష్ప పార్ట్‌-3కి అంతా రెడీ.. ఓ రేంజ్‌లో ప్లాన్‌ చేస్తున్న సుకుమార్‌

పుష్ప-2 సినిమా మీద ఆడియన్స్‌కు ఏ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయో రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌ వ్యూస్‌ చూస్తే అర్థమౌతుంది. ఈ వీడియోకు అన్ని భాషల్లో కలిపి 75 మిలియన్ల వ్యూస్ రాగా.. 3 మిలియన్ల లైక్స్ వచ్చాయి. అయితే.. ఓన్లీ హిందీ గ్లింప్స్‌కి 20 లక్షల లైక్స్ వచ్చాయి. బాలీవుడ్‌లో కేవలం పఠాన్, పుష్ప-2 గ్లింప్స్ వీడియోలకు మాత్రమే 2 మిలియన్ల లైక్స్ వచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 13, 2023 | 07:15 PMLast Updated on: Apr 13, 2023 | 7:15 PM

Sukumar Allu Arjun Ready For Make Pushpa 3

ఈ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ చేసిన పుష్ప సినిమా గురించి దిమ్మతిరిగే అప్‌డేట్‌ వచ్చింది. పుష్ప ఫ్రాంఛైజీలో మరో సినిమా తీయబోతున్నాడట సుకుమార్‌. త్వరలోనే పుష్ప-3 కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ ని కొంత గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాడట సుకుమార్‌. పుష్ప 2 రిలీజ్ తర్వాత సుకుమార్ రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ మూవీకి సంబందించిన కొన్ని సీక్వెన్సెస్‌ని కూడా ఇప్పటికే షూట్‌ చేసినట్టు టాక్‌ నడుస్తోంది.

వచ్చే ఏడాది రామ్ చరణ్ మూవీని సుకుమార్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. దాని తర్వాత 2025లో లేదంటే 26లో పుష్ప పార్ట్ 3 మూవీని తెరకెక్కించే ఉందని సినీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. ఈ గ్యాప్‌లో విజయ్ దేవరకొండతో సుకుమార్ ఎనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ కూడా కంప్లీట్‌ చేస్తాడని అంటున్నారు. ఈ సినిమా అటు ఇటూగానే ఉన్నా.. రామ్‌ చరణ్‌ సినిమా తరువాత సుకుమార్‌ పుష్ప 3 కూడా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ బన్నీ ఫ్యాన్స్‌ను షేక్‌ చేస్తోంది. ఇప్పటికే పుష్ప 2 నుంచి రిలీజైన గ్లింప్స్‌, పోస్టర్‌తో ఆడియన్స్‌లో ఓ రేంజ్‌ జోష్‌లో ఉన్నారు. ఇప్పుడు మరో సినిమా కూడా రాబోతోందని తెలియడంతో వెయిటింగ్‌ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.